Share News

Viral Video: పామును వేటాడుతున్న డేగకు ఊహించని షాక్.. క్షణాల్లో సీన్ ఎలా మారిపోయిందో చూడండి..!

ABN , Publish Date - May 24 , 2024 | 04:16 PM

డేగ అయినా, పాము అయినా వేగంలో దేనికదే సాటి. వేటలో కూడా రెండూ హేమాహేమీలే.. అయితే ఓ డేగ పామును వేటాడి ఇక విజయం సాధించేశాను అనుకునేలోపే దానికి ఊహించని షాక్ తగిలింది. క్షణాల్లోనే సీన్ మారిపోయింది.

Viral Video: పామును వేటాడుతున్న డేగకు ఊహించని షాక్..  క్షణాల్లో సీన్  ఎలా మారిపోయిందో చూడండి..!

పాము, డేగ మీద కథలు, సినిమా సీన్ లు బోలెడు. అవన్నీ కథలలో చదవడం, సినిమాల్లో చూడటమే కానీ నిజంగా ఈ రెండూ తలపడితే ఎలా ఉంటుందో చూసిన వాళ్లు తక్కువ. డేగ అయినా, పాము అయినా వేగంలో దేనికదే సాటి. వేటలో కూడా రెండూ హేమాహేమీలే.. అయితే ఓ డేగ పామును వేటాడి ఇక విజయం సాధించేశాను అనుకునేలోపే దానికి ఊహించని షాక్ తగిలింది. క్షణాల్లోనే సీన్ మారిపోయి ఏకంగా డేగ ప్రాణపాయ స్థితికి చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన బోలెడు వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇది కూడా అలాంటి వీడియోనే. ఒక డేగ పామును వేటాడి తన కాలి గోళ్ళతో బంధించింది. పాము ముఖాన్ని తన ముక్కుతో పొడిచి దాన్ని చంపి తినడానికి డేగ ప్రయత్నిస్తోంది. ఇక పాము చనిపోయినట్టే అని అందరికీ అనిపిస్తుంది కూడా. కానీ సడన్ గా క్షణాల్లోనే అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. చావు బ్రతుకుల మధ్య ఉన్న పాము తన ప్రాణాలు కాపాడుకోవడానికి తెగించింది. అది మెల్లగా డేగ మీద పట్టు బిగిస్తుంది. డేగ మెడకు చుట్టుకుని డేగను కింద పడేలా చేస్తుంది. డేగ ఓడిపోయింది. పాము తన ప్రాణాలు రక్షించుకుంది.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!


ఈ వీడియోను Nature is Amazing అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. దీన్నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. జీవితంలో ప్రారంభించిన పనిని అసంపూర్తీగా వదిలేయకూడదని, లేకపోతే పరిస్థితి డేగలా మారుతుందని కొందరు అంటున్నారు. ఈ వీడియోను చాలామంది ఇష్టపడుతున్నారు.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 24 , 2024 | 04:16 PM