Share News

Viral: తాను చనిపోతున్నా.. విధులు మరవని ఉపాధ్యాయుడు..!

ABN , Publish Date - Jan 14 , 2024 | 04:35 PM

Viral News: విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తరువాత అంతటి ముఖ్యమైన పాత్ర పోషించేది విద్యా్ర్థులే. ఇంట్లో నుంచి వెళ్లిన తరువాత వారు అత్యధిక సమయం గడిపేది విద్యాసంస్థలోనే. అందుకే.. స్టూడెంట్స్, టీచర్స్‌కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. టీచర్స్ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతారు. ఉత్తమ వ్యక్తులుగా, ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.

Viral: తాను చనిపోతున్నా.. విధులు మరవని ఉపాధ్యాయుడు..!
Teacher Final Moments

Viral News: విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తరువాత అంతటి ముఖ్యమైన పాత్ర పోషించేది విద్యా్ర్థులే. ఇంట్లో నుంచి వెళ్లిన తరువాత వారు అత్యధిక సమయం గడిపేది విద్యాసంస్థలోనే. అందుకే.. స్టూడెంట్స్, టీచర్స్‌కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. టీచర్స్ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతారు. ఉత్తమ వ్యక్తులుగా, ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. కొంతమంది ఉపాధ్యాయులు వృత్తిపట్ల నిబద్ధత కనబరుస్తారు. అదే సమయంలో తమ విద్యార్థులను ప్రేమగా చూసుకుంటూ.. వారి భవిష్యత్ కోసం, వారి చదువు కోసం ఏమైనా చేస్తారు. తమ విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా అందుకు నిదర్శనమైన ఉపాధ్యాయుడికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఉపాధ్యాయుడు తాను చనిపోబోతున్నానని తెలిసి కూడా ఆ ముందు రోజు వరకు విద్యార్థులకు సంబంధించి పని చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ బెడ్‌పై ఉండి విద్యార్థులకు గ్రేడింగ్స్ ఇచ్చే పనిని పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

'నాట్ కామన్ ఫ్యాక్ట్స్' అనే ఐడీతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో ఈ విషాదకర అంశాన్ని పోస్ట్ చేశారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్‌లో ఉండి కూడా తన విధులను నిర్వహించారు ఆ టీచర్. ల్యాప్‌టాప్‌ తీసుకుని.. విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న తన పనిని పూర్తి చేశాడు. ఆ మరుసటి రోజు విషాదాన్ని నింపుతూ.. ఆయన స్వర్గస్తులయ్యారు. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తోంది. సదరు ఉపాధ్యాయుడి కూతురు సాండ్రా వెనిగాస్ విధుల పట్ల తన తండ్రి అంకిత భావాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరల్ అవుతోంది.

వృత్తి పట్ల ఉపాధ్యాయుడి అంకితభావం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే ఎంతో మంది మేధావులు తయారవుతున్నారని పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 04:35 PM