Share News

Leopard: మద్యం మత్తులో గతం మరిచిన చిరుత.. గ్రామస్తులు ఎలా ఆడుకున్నారో చూడండి..

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:55 PM

మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు చిరుతతో ఆడుకున్నారు. దాని పక్కనే నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దానికి కారణం ఆ పులి తనను తాను మరిచిపోయేంతలా మద్యం మత్తులో మునిగిపోవడమే.

Leopard: మద్యం మత్తులో గతం మరిచిన చిరుత.. గ్రామస్తులు ఎలా ఆడుకున్నారో చూడండి..

సింహం, పులి, చిరుత వంటి వన్య మృగాలంటే మనుషులకు చాలా భయం. బోనులో ఉన్న వాటి జోలికి వెళ్లేందుకు కూడా చాలా మంది సాహసించరు. అలాంటిది మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు చిరుతతో (Leopard) ఆడుకున్నారు. దాని పక్కనే నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దానికి కారణం ఆ పులి తనను తాను మరిచిపోయేంతలా మద్యం మత్తులో మునిగిపోవడమే (Drunken leopard). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Leopard Video).

mwanaa_bishop అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో చిరుతపులితో పాటు పదుల సంఖ్యలో ప్రజలు నడుస్తున్నారు. దానిని పట్టుకుంటున్నారు. అయినా ఆ పులి ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. మహారాష్ట్రలోని తారాగఢ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో మద్యం తయారు చేసే డిస్టిలరీ ఉంది. దానిలోకి ప్రవేశించిన చిరుత ఫుల్‌గా మందు కొట్టేసింది. అనంతరం తనను తాను మరిచిపోయి మత్తులో మునిగిపోయింది. మత్తులో ఉన్న చిరుతతో గ్రామస్తులు భయం లేకుండా ప్రవర్తించారు.

ఆ చిరుతను గ్రామస్తులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దానిని కొడుతూ ముందుకు నడిచారు. అయినా చిరుత ఏమీ చేయకుండా సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్లింది. సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియోను 1.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 10 లక్షల మంది దీన్ని లైక్ చేసారు. ఈ వీడియోపై జనాలు ఫన్నీ కామెంట్లు చేశారు.``ఇది ఇంట్రావర్ట్ చిరుతపులి``, ``చిరుతపులి జంతువుల మధ్య చిక్కుకుంది``, ``ఇలా భారతదేశంలో మాత్రమే జరుగుతుంది``, ``సోదరుడు షాక్‌లో ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 06:00 PM