Share News

Anant Ambani Pre-wedding: మా ఇంట్లో నిజమైన డాన్ ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న ముఖేష్-నీతా ఫన్నీ వీడియో!

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:16 PM

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బిజినెస్ టైకూన్స్ హాజరయ్యారు

Anant Ambani Pre-wedding: మా ఇంట్లో నిజమైన డాన్ ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న ముఖేష్-నీతా ఫన్నీ వీడియో!

ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడ్రోజుల పాటు జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి (Anant-Radhika's pre-wedding bash). గుజరాత్‌లోని జామ్ నగర్‌ (Jamnagar)లో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బిజినెస్ టైకూన్స్ హాజరయ్యారు. బాలీవుడ్ అగ్ర కథానాయకులు సైతం ఈ వేడుకలో చిందులేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) సైతం డ్యాన్స్‌లు వేశారు.

వారిద్దరూ కలిసి చేసిన ``డాన్`` స్కిట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ స్కిట్‌లో ముఖేష్ అంబానీ సూట్ ధరించి ఓ కుర్చీలో కూర్చుని ``డాన్‌ను పట్టుకోవడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా`` అంటూ ఫేమస్ డైలాగ్ చెప్పారు. అప్పుడు నీతా అంబానీ లోపలికి ప్రవేశించి ``ఈ డాన్‌ను ఇప్పటికే నలుగురు మనవలు పట్టేసుకున్నారు`` అని కామెంట్ చేశారు. ``రా ముఖేష్.. ఇప్పుడు మన చిన్న కొడుకు అనంత్ సంగీత్ కార్యక్రమానికి వెళ్లాలి`` అని పిలిచారు. వెంటనే ముఖేష్ కళ్లద్దాలు తీసేసి.. ``యస్ బాస్`` అంటూ నీతా వెనుక వెళ్లిపోయారు.

అనంతరం ``మా జీవితాల్లో ఒకే ఒక్క డాన్. ఆమె నీతా అంబానీ మాత్రమే`` అని ముఖేష్ వ్యాఖ్యానించారు. అనంతరం నీతా అంబానీ ఛైర్‌లో స్టైల్‌గా కూర్చుని డాన్‌లా ఫోజుచ్చారు. ఈ వీడియోను అనంత్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో ప్రదర్శించారు. ఈ వీడియో అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Mar 04 , 2024 | 04:16 PM