Watch Video: మనం తినే బ్రెడ్ ఎంతో సురక్షితమో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Feb 06 , 2024 | 08:51 PM
మనం రోజూ తినే బ్రెడ్ ఎలా తయారవుతుందో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.
చాలా మంది ఆరోగ్యం కోసమో, అనారోగ్యంతో ఉన్నప్పుడో బ్రెడ్ (Bread) తింటూ ఉంటారు. చాలా మంది దానిని ఆరోగ్యకర స్నాక్‌గా భావిస్తారు. బ్రెడ్‌ను కేవలం స్నాక్‌గానే కాదు.. కొందరు బ్రేక్ ఫాస్ట్‌గా, మరికొందరు డిన్నర్‌గా కూడా తింటారు. అలాంటి బ్రెడ్ ఎలా తయారవుతుందో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ ఫ్యాక్టరీలో బ్రెడ్ తయారు చేస్తున్న విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Bread Making Video).
planetashish అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. అందులో కొందరు కార్మికులు బ్రెడ్ తయారీ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. అయితే ఎవరూ చేతులకు గ్లౌజ్‌లు వేసుకోలేదు. వారు ఉపయోగిస్తున్న పరికరాలు కూడా పరిశుభ్రంగా లేవు. నిలబడిన చోటే తయారు చేసిన బ్రెడ్‌లను పడేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీలో ఈ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ బ్రెడ్‌లు ఆరోగ్యం కోసం కాదు.. అనారోగ్యం కావాలంటే తినాలి``, ``చాలా ఆహార పదార్థాలు ఇలాగే తయారవుతాయి``, ``అపరిశుభ్రం అనేది మనకు చాలా సాధారణ విషయం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.