Share News

Rapido: ఇదెక్కడి దారుణం.. ర్యాపిడో డ్రైవర్‌కు చుక్కలు చూపిన కస్టమర్.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగకపోతే..

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:09 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ ర్యాపిడో రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగడానికి కస్టమర్ అంగీకరించలేదు.

Rapido: ఇదెక్కడి దారుణం.. ర్యాపిడో డ్రైవర్‌కు చుక్కలు చూపిన కస్టమర్.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగకపోతే..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎన్నో రకాల సౌకర్యాలు మన కాళ్ల దగ్గరకే వస్తున్నాయి. ముఖ్యంగా బస్‌స్టాప్‌లు వెతుక్కుని బస్‌ల కోసం వెయిట్ చేయడం, ఆటోల కోసం ఎదురు చూడడం వంటి తిప్పలు లేకుండా ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. యాప్‌ ఓపెన్ చేసి బుక్ చేస్తే చాలు.. నిమిషాల్లో బైక్ మన ముందుకు వచ్చి మనం దిగాల్సిన చోట దింపేస్తుంది. చాలా మంది బైక్ రైడర్లకు పని దొరికింది. అయితే హైదరాబాద్‌ (Hydereabad)కు చెందిన ఓ ర్యాపిడో రైడర్‌కు (Rapido Rider) వింత అనుభవం ఎదురైంది.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన గమ్య స్థానానికి చేరుకునేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో రైడర్ ఆ వ్యక్తిని ఎక్కించుకుని బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో పెట్రోల్ (Petrol) అయిపోయింది. పెట్రోల్ అయిపోయినా ఆ కస్టమర్ మాత్రం బైక్ దిగలేదు. పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావడానికి కస్టమర్‌ అంగీకరించలేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆ రైడర్ ఆ కస్టమర్ కూర్చుండగానే బైక్ (Bike) తోసుకుని వెళ్లాడు.

ఈ తతంగం మొత్తాన్ని వెనుక ఉన్న కారులోని వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. గంటల వ్యవధిలో భారీ వ్యూస్, లైక్స్ దక్కించుకుంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది చాలా అన్యాయం``, ``పాపం.. ఆ రైడర్‌కు పెద్ద కష్టమే వచ్చింది``, ``ఆ వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉన్నాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 03:09 PM