Share News

Viral Video: వివాహ వేదికపై వధువు ముందు ట్యాలెంట్ ప్రదర్శించిన వరుడు.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్ ఏంటంటే..

ABN , Publish Date - Feb 17 , 2024 | 09:13 PM

మన జీవితంలోని ప్రత్యేక సందర్భాలను వీడియోలో బంధించడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ప్రస్తుతం సాధారణ ఆకాంక్షగా మారిపోయింది.

Viral Video: వివాహ వేదికపై వధువు ముందు ట్యాలెంట్ ప్రదర్శించిన వరుడు.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్ ఏంటంటే..

మన జీవితంలోని ప్రత్యేక సందర్భాలను వీడియోల్లో బంధించడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది చాలా మంది ప్రజలు సాధారణ ఆకాంక్షగా మారిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram reels) కోసం కొందరు పడే తపన చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా వివాహం చేసుకున్న ఓ వరుడు (Groom) తన పెళ్లి వేడుకలో (Wedding) కూడా రీల్స్ కోసం నటించాడు. బాలీవుడ్ సినిమాలోని ఓ పాటకు తనదైన శైలిలో అభినయించాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

@rahulroushan అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి.. ``రీల్స్ నుంచి నా దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి`` అని కామెంట్ చేశారు. ``రాజా వ్లాగ్స్`` అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న రాజా బాబు అనే వ్యక్తి తన వివాహ వేడుకలో ఇన్‌స్టా రీల్స్ కోసం యాక్టింగ్ చేశాడు. వధువుకు (Bride) సిందూరం దిద్దుతూ తనదైన శైలిలో నటించాడు. ``వివాహ్`` సినిమాలోని ``దో అంజానే అజ్ఞాతవాసి`` పాటకు అద్భుతమైన హావభావాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

ఆ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మంది వీక్షించారు. దాదాపు పది వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు పేల్చారు. ``ఆ పెళ్లి అయినా నిజమేనా? రీల్స్ కోసమా?``, ``వెనుక ఉన్న వారు జూనియర్ ఆర్టిస్ట్‌ల్లా ఉన్నారు``, ``సిందూరం పింక్ రంగులో ఉందేంటి భయ్యా``, ``ఆ వ్యక్తి ఎక్స్‌ప్రెషన్ పీక్‌లో ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 09:13 PM