Share News

Viral Video: వీడెవడ్రా బాబు.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు..

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:08 PM

ఓ పెళ్లి ఊరేగింపులో గందరగోళం నెలకొంది. ఇక, ఆవేశంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు. పెళ్లిలో ఎంతో సంతోషంగా ఉండాల్సిన వరుడు ఎందుకు అంత కోపం తెచ్చుకున్నాడు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Viral Video: వీడెవడ్రా బాబు.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు..

Viral Video : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. పెళ్లి వేడుక జరిగే ఇంట్లో బంధువులు, మేళతాళలతో ఎంతో కోలహాలంగా ఉంటుంది. చిన్నా, పెద్ద అందరూ కలిసి ఎంతో సంతోషంగా చిందులేస్తుంటారు. అయితే, ఆయా పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ వరుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


కోపంతో రగిలిపోయి..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వరుడు తన వివాహ వేదిక వద్దకు గుర్రంపై బయలుదేరాడు. ఆచారంలో భాగంగా మెడలో భారీ కరెన్సీ నోట్ల దండ ధరించి ఊరేగింపుగా వెళ్లాడు. అయితే, ఓ దొంగ ఆ డబ్బుపై కన్నేసి దండలోని కొంత కరెన్సీ నోటును ఎత్తుకెళ్లాడు. దీంతో పెళ్లి ఊరేగింపులో గందరగోళం నెలకొంది. ఇక తన పెళ్లిలో ఇది అవమానంగా భావించిన వరుడు.. ఆ దొంగపై కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గుర్రంపై నుండి దిగి తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్లి దొంగను వెంబడించాడు.


చితక్కొట్టాడు..

భారీ కరెన్సీ నోట్ల దండ ధరించిన వరుడు దొంగ నడుపుతున్న మినీ ట్రక్‌పై దూకి, దాని కిటికీలోంచి డ్రైవర్ క్యాబిన్‌లోకి జాగ్రత్తగా ప్రవేశించాడు. దొంగ పారిపోకుండా అతడిని పట్టుకుని ట్రక్ లో నుంచి బయటకు లాక్కొని వచ్చి చితక్కొట్టాడు. ఆవేశంతో దొంగను పిడిగుద్దులు గుద్దాడు. వెంటనే, మరికొంత మంది వచ్చి వరుడి దండలో కొంత నగదును దొంగిలించినందుకు దొంగను బాగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడెవడ్రా బాబు..

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వరుడు హీరోగా మారడని, పెళ్లి కొడుకా మజాకా అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇంకొందరు వీడెవడ్రా బాబు.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించి మరి దొంగను చితక్కొట్టాడు అని రియాక్ట్ అవుతున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 02:12 PM