Share News

Shocking: రెండు నిమిషాల వీడియో కాల్.. 200 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ!

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:01 AM

అమెరికా స్టార్టప్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ సంస్థ తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఉద్యోగులను ఉన్న పళంగా ఇంటికి పంపించేసింది. ఉద్యోగులందరికీ ఒకేసారి వీడియో కాల్ చేసి ఈ షాకింగ్ విషయం చెప్పింది.

Shocking: రెండు నిమిషాల వీడియో కాల్.. 200 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ!

అమెరికా (America) స్టార్టప్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ (Frontdesk) సంస్థ తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఉద్యోగులను ఉన్న పళంగా ఇంటికి పంపించేసింది (Layoffs). ఉద్యోగులందరికీ ఒకేసారి వీడియో కాల్ (Google Meet Call) చేసి ఈ షాకింగ్ విషయం చెప్పింది. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కాంట్రాక్టర్లు.. ఇలా 200 మందిని ఒకేసారి తొలగించింది.

ఫ్రంట్‌డెస్క్ సంస్థ సీఈవో జెస్సీ డిపంటో ఉద్యోగులందరికీ గూగుల్ మీట్ ద్వారా కాల్ చేశారు. సంస్థ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి, అద్దె చెల్లింపు కూడా చేయలేకపోతుండడం గురించి ఉద్యోగులకు వివరించారు. స్టేట్ రిసీవర్ షిప్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బాంబు పేల్చారు. దీంతో అందరూ షాకయ్యారు. ఫ్రంట్‌డెస్క్ సంస్థ 2017లో ప్రారంభమైంది. ఈ సంస్థ అమెరికా వ్యాప్తంగా 1000కు పైగా ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్లను నిర్వహిస్తోంది.

ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకుని వాటిని ఇతరులకు అద్దెకు ఇస్తుంది. పలు ప్రముఖ సంస్థల నుంచి సుమారు 28 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినప్పటికీ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ప్రత్యర్థి సంస్థలను కొనుగోలు చేయడం కోసం నిధులను వెచ్చించడం సంస్థ ఆర్థిక ఇబ్బందులకు కారణమని తెలుస్తోంది.

Updated Date - Jan 06 , 2024 | 09:01 AM