Share News

Viral: విమానంలో కుక్క చేసిన పనికి సిబ్బందికి నరకం..! టేకాఫ్ అయిన గంట తరువాత..

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:10 PM

విమానంలో సీట్ల మధ్య కుక్క మలవిసర్జన చేయడంతో ప్రయాణికులు, సిబ్బందికి చుక్కలు కనిపించాయి. విమానం టేకాఫ్ అయిన గంటసేపటికే మరో విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిపోవాల్సిన వచ్చింది.

Viral: విమానంలో కుక్క చేసిన పనికి సిబ్బందికి నరకం..! టేకాఫ్ అయిన గంట తరువాత..

ఇంటర్నెట్ డెస్క్: విమానంలో సీట్ల మధ్య కుక్క మలవిసర్జన చేయడంతో ప్రయాణికులు, సిబ్బందికి చుక్కలు కనిపించాయి. విమానం టేకాఫ్ అయిన గంటసేపటికే మరో విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిపోవాల్సిన వచ్చింది. అమెరికాలో హ్యూస్టన్ నుంచి సియాటెల్ బయలుదేరిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి.

Viral: విమానంలో రెచ్చిపోయిన లవర్స్.. 4 ఖాళీ సీట్లను మంచంలా వాడేసుకుంటూ.. పబ్లిక్‌గా..


ప్రయాణికులు నెట్టింట పంచుకున్న వివరాల ప్రకారం, ఇటీవల విమానం హ్యూస్టన్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరువాత ఓ కుక్క.. ఫస్ట్ క్లాస్‌‌లో సీట్ల మధ్య నడవాలో మలవిసర్జన చేసింది. దీంతో, విమానం అంతా దుర్గంధం వ్యాపించి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రయాణికులు కనీసం బాత్రూమ్ వాడుకునేందుకు కూడా వీల్లేకపోయింది. విమానంలోని వారందరికీ నరకం కనిపించింది. దీంతో, గత్యంతరం లేక విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి డాలస్‌లో దింపేయాల్సి వచ్చింది (US Flight Diverted After Dog Poops In First Class).

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..


కాగా, ఈ ఘటన వైరల్ కావడంతో నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కుక్కను అలా వదిలేసిన యజమానిని పలువురు తిట్టిపోశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ప్యాసెంజర్‌పై భారీ జరిమానా విధించాలని కొందరు డిమాండ్ చేశారు. మరోవైపు, ఘటనపై ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. పెంపుడు కుక్కలతో విమానం ఎక్కేవారు వాటిని బొనులో పెట్టాలని చెప్పారు. జంతువు ఉన్న బోనులను తమ సీటు వద్దే ఉంచుకోవాలని చెప్పారు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 07:20 PM