Share News

Viral Video: ఇది ఐస్ పులిహోర.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత వంటకం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:38 PM

రకరకాల కాంబినేషన్లతో తయారు చేస్తున్న వంటకాలు ఇటీవలి కాలంలో చాలా మందిని ఆశ్చర్యపరస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఇది ఐస్ పులిహోర.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత వంటకం.. వైరల్ అవుతున్న వీడియో!

మనకు ఆశ్చర్యం కలిగించే లేదా ఆనందం కలిగించే రకరకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వెరైటీ ఆహారాలకు సంబంధించిన వీడియోలు (Food Videos) బాగా వైరల్ అవుతున్నాయి. రకరకాల కాంబినేషన్లతో తయారు చేస్తున్న వంటకాలు చాలా మందిని ఆశ్చర్యపరస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఐస్‌తో చేసిన వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ruc.hhiiiiii అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ పెద్ద ఐస్ (Ice) ముక్కను ప్లేట్‌లో పెట్టి దానిని పొడిగా చేసింది. అనంతరం దానికి చింతపండు రసం, కారం, ఉప్పు వేసి బాగా కలిపింది. ఆ తర్వాత దానిపై కొద్దిగా పంచదార వేసింది. ఆ తర్వాత దానిని గిన్నెలో వేసుకుని తినేసింది. ఈ వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 86 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ వంటకం పేరేంటి``, ``తొందరగా తినకపోతే కరిగిపోతుంది``, ``ఇది ఐస్ పులిహోర``, ``ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 23 , 2024 | 03:38 PM