Share News

Shocking: ఆకస్మాత్తుగా దూసుకొస్తున్న వరద నీరు.. ట్రక్ త్రుటిలో ఎలా బయటపడిందో చూడండి..

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:55 PM

ఓ ట్రక్‌ను అన్ని వైపుల నుంచి వరద నీరు చుట్టు ముట్టింది. అయితే డ్రైవర్ అతి వేగంగా నడపడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

Shocking: ఆకస్మాత్తుగా దూసుకొస్తున్న వరద నీరు.. ట్రక్ త్రుటిలో ఎలా బయటపడిందో చూడండి..

అకస్మాత్తుగా దూసుకొచ్చే వరదల (Flash Floods) నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వేగంగా ప్రవహించే ఆ వరద నీరు చాలా తీవ్ర నష్టాలను కలుగచేస్తుంది. సౌదీ అరేబియాలో (Saudi Arabia) రికార్డ్ అయిన ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఓ ట్రక్‌ను (Truck)అన్ని వైపుల నుంచి వరద నీరు చుట్టు ముట్టింది. అయితే డ్రైవర్ అతి వేగంగా నడపడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో సౌదీ అరేబియాలోని ఎడారిలో ఆకస్మాత్తుగా వరద నీటి ప్రవాహం పెరిగిపోయింది. అప్పటికే అక్కడ ఉన్న కొన్ని ట్రక్కులు తప్పించుకున్నాయి. అయితే ఓ ట్రక్కు మాత్రం బయటకు రావడానికి వీలు పడలేదు. దీంతో వరద నీటిని మించిన వేగంతో డ్రైవర్ ఆ ట్రక్కును నడిపాడు. చివరకు ఆ పోటీలో క్షణాల వ్యవధిలో ట్రక్కు డ్రైవర్ గెలిచాడు. దీంతో ఆ ట్రక్కు సురక్షితంగా వరద నీటి నుంచి బయటపడగలిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ డ్రైవర్ చాలా అదృష్టవంతుడు``, ``డ్రైవర్ వరద నీటి కంటే వేగంగా ఆలోచించాడు``, ``ఈ వీడియో ఏదైనా కార్ యాడ్‌కు ఉపయోగించుకోవచ్చు`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 03:55 PM