Share News

Viral Video: భయంకరమైన యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన ట్రక్ బ్రిడ్జ్‌కు ఎలా వేలాడుతోందో చూడండి..

ABN , Publish Date - May 20 , 2024 | 03:39 PM

అమెరికాలోని కెంటకీలో జరిగిన ఓ యాక్సిడెంట్ చూసే వారిని భయకంపితులను చేస్తోంది. నది మీద కట్టిన వంతెనపై వేగంగా వెళ్లిన ట్రక్కు ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టి వంతెన గోడలను ఢీకొట్టింది. డ్రైవర్ అదృష్టం ఏంటంటే.. ఆ ట్రక్కు పూర్తిగా నదిలో పడలేదు.

Viral Video: భయంకరమైన యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన ట్రక్ బ్రిడ్జ్‌కు ఎలా వేలాడుతోందో చూడండి..
Truck accident

అమెరికా (America)లోని కెంటకీలో జరిగిన ఓ యాక్సిడెంట్ (Accident) చూసే వారిని భయకంపితులను చేస్తోంది. నది మీద కట్టిన వంతెనపై వేగంగా వెళ్లిన ట్రక్కు ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టి వంతెన గోడలను ఢీకొట్టింది. డ్రైవర్ అదృష్టం ఏంటంటే.. ఆ ట్రక్కు పూర్తిగా నదిలో పడలేదు. క్యాబిన్ గాల్లో వేలాడుతూనే ఉంది. దాదాపు గంట పాటు ఆ ట్రక్కు (Truck) డ్రైవర్ వంతెన పై నుంచి గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. ఆమెను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గంట పాటు శ్రమించింది (Viral Video).


ఈ ప్రమాదం ఈ ఏడాది మార్చి నెలలో జరిగింది. ఆ ప్రమద ఘటనను ట్రక్కులోని డాష్ క్యామ్ చిత్రీకరించింది. తాజాగా బయటపడిన ఆ వీడియో వైరల్‌గా మారింది. కారు డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు ఇంత పెద్ద ప్రమాదానికి ఎలా దారితీసిందో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ట్రక్కు కెంటకీ (Kentucky)లోని ఒహియో నది మీద ఉన్న లూయిస్‌విల్లే బ్రిడ్జిపై వెళుతోంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు లైన్ దాటి ఇటువైపుకు వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో షాక్‌కు గురైన డ్రైవర్ సిడ్నీ థామస్ ట్రక్కు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయింది.


ఆ భారీ ట్రక్కు వంతెనను బద్దలుగొట్టి ముందుకు వెళ్లిపోయింది. ట్రక్కు బ్రిడ్జి మీదే ఉండగా డ్రైవర్ క్యాబిన్ మాత్రం గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. దాదాపు గంట పాటు ఆ డ్రైవర్ అలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండిపోయింది. దాదాపు గంట శ్రమించిన తర్వాత రెస్క్యూ టీమ్ ఆమెను కాపాడింది. ఈ ఘటనలో ఆమె కాలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం వీల్ ఛైర్‌లో ఉంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఆర్సీబీ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన ధోనీ.. అప్పుడు కోహ్లీ ఏం చేశాడంటే!


Viral News: పిల్లికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అవార్డు.. దాని వెనుకున్న ఆసక్తికర కారణం ఏంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2024 | 03:39 PM