Share News

Cockroache: బొద్దింకలతో విసుగెత్తిపోయారా? ఈ 4 వస్తువులలో ఒక దానిని నీళ్లలో కలపండి..

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:20 PM

ఇంట్లో బొద్దింకల వేధింపులతో విసుగెత్తిపోయారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట్లో నుండి బొద్దింకలు వెళ్లిపోవడం లేదా? బొద్దింకలను తరమికొట్టాలంటే ఈ 4 వస్తువులలో ఒక దానిని నీళ్లలో వేసి ఇంటిని శుభ్రం చేయండి.

Cockroache: బొద్దింకలతో విసుగెత్తిపోయారా?  ఈ 4 వస్తువులలో ఒక దానిని నీళ్లలో కలపండి..
cockroaches

Cockroaches: తరచూ ఇంటిని శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వంటింటిని శుభ్రం చేసుకోవడం అత్యవసరం. అయితే, ఎంత క్లీన్ గా పెట్టుకున్న ప్రతి ఇంటి ఇల్లాలిని బొద్దింకలు వేదిస్తునే ఉంటాయి. వాటిని ఎదుర్కొవడం అతి పెద్ద సమస్య. ఎందుకంటే ఒక్కటి ఇంట్లో చేరితే వందల కొద్దీ పుట్టుకొస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట వంటగది నిండా బొద్దింకలు తిరుగుతాయి. ఎంత తరిమి కొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే, బొద్దింకలే కదా అని ఊరుకుంటే ఇంట్లో వ్యాధులు తిష్టవేసినట్లే. కాబట్టి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వెంటనే వాటిని వదిలించుకోవడం చాలా మంచిది. వీటిని బయటికి పంపాలంటే ఈ చిట్కాలు పాటించండి..


1. లవంగాలు

లవంగాల సహాయంతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. లవంగాల వాసన అంటే బొద్దింకలకు అలెర్జీ. ఆహారం కోసం అవి తిరిగే ప్రదేశాల్లో కొన్ని లవంగాలను ఉంచాలి. అలా చేయడం వల్ల ఆ వాసనకు బొద్దింకలు అటువైపు రావు. ఆహారం దొరక్క ఇంటి నుంచి అవే బయటికి వెళ్లిపోతాయి. లేదంటే కొన్ని లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి. తర్వాత ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసినా బొద్దింకలు వెళ్లిపోతాయి.

2. నిమ్మరసం

నిమ్మరసంతో కూడా ఇంటి నుంచి బొద్దింకలను తరమికొట్టవచ్చు. నీళ్లల్లో నిమ్మరసం కలిపి తరచూ ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో ఆ నీటిని చల్లుతూ ఉండాలి. వాటికి నిమ్మరసం వాసన నచ్చదు కాబట్టి ఇంట్లో నుంచి అవి వెళ్లిపోతాయి.

3. తమలపాకు

తమలపాకు బొద్దింకలను తక్షణమే తరిమికొడుతుంది. తమలపాకులను నీళ్లలో నానబెట్టి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక చెంచా వేడినీటిలో కలిపి ఇంట్లో చల్లండి. బొద్దింకలు వెంటనే ఇంటి నుండి పారిపోతాయి.

4. పొట్లకాయ తొక్క

పొట్లకాయ తొక్కను పేస్ట్‌లా చేసి వేడినీటిలో కలపండి. తర్వాత ఈ నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఈ నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఇతర కీటకాలు కూడా ఇంటి నుంచి బయటకు వస్తాయి.

కిరోసిన్

కిచెన్ ప్లాట్ ఫామ్ మీద బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి. కాబట్టి, ఒక వస్త్రంలో కిరోసిన్ ముంచి ఆ ప్లాట్ ఫామ్ ను తుడవండి. ఆ వాసన ఉన్నంత కాలం ఒక్క బొద్దింక కూడా అటు వైపు రాదు.

(Note: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ వీటిని ధృవీకరించలేదు.)

Updated Date - Nov 29 , 2024 | 01:23 PM