Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నీళ్లు తాగుతున్న జింకను పులి ఎంత క్రూరంగా చంపిందో చూడండి..

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:19 PM

మంచినీళ్లు తాగుతున్న ఓ సాంబార్ జింకను ఓ పులి అత్యంత క్రూరంగా వేటాడి చంపిన షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నీళ్లు తాగుతున్న జింకను పులి ఎంత క్రూరంగా చంపిందో చూడండి..

సాంబార్ జింకలు (Sambar Deer) ఎక్కువగా భారతదేశంలోనే కనిపిస్తాయి. ఇతర జింకలతో పోలిస్తే ఇవి కాస్త భారీ శరీరంతో ఉంటాయి. మంచినీళ్లు తాగుతున్న ఓ సాంబార్ జింకను ఓ పులి (Tiger) అత్యంత క్రూరంగా వేటాడి చంపిన షాకింగ్ వీడియో (Tiger killed Deer) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో (Ranthambore National Park) అమర్చిన సీసీటీవీ కెమేరాలో ఈ వీడియో రికార్డ్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ఓ మడుగు వద్ద ఓ సాంబార్ జింక మంచినీళ్లు తాగుతోంది. ఆ సమయంలో మెల్లిగా అక్కడకు వచ్చిన ఓ ఆడ పులి ఆ జింక మెడను పట్టుకుంది. జింక తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా పులి ముందు దాని బలం సరిపోలేదు. చివరకు పులి ఆ జింకను నీటిలో పడేసి మెడ కొరికేసింది. పులి పట్టు నుంచి తప్పించుకోలేకపోయిన జింక ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా భయంకరంగా ఉంది``, ``పులిని చూసి ఆ జింక్ షాకైంది.. పోరాడడం మర్చిపోయింది``, ``పులికి చిక్కితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 04:19 PM