Share News

Viral: పాకిస్తాన్‌లో చెట్టు అరెస్ట్.. తాగిన మైకంలో నాటి బ్రిటీష్ అధికారి చేసిన నిర్వాకం ఏంటంటే..

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:40 AM

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే అధికారులు, పాలకులు శిక్ష విధించడం అనేది తప్పుదు. అప్పుడప్పుడు జంతువులకు శిక్ష కూడా పడిన ఘటనల గురించి విన్నాం. అయితే పాకిస్తాన్‌లోని ఓ చెట్టుకు 125 ఏళ్ల క్రితం శిక్ష పడింది. ఆ చెట్టు ఇప్పటికీ ఆ శిక్షను అనుభవిస్తూనే ఉంది.

Viral: పాకిస్తాన్‌లో చెట్టు అరెస్ట్.. తాగిన మైకంలో నాటి బ్రిటీష్ అధికారి చేసిన నిర్వాకం ఏంటంటే..

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే అధికారులు, పాలకులు శిక్ష విధించడం అనేది తప్పుదు. అప్పుడప్పుడు జంతువులకు శిక్ష కూడా పడిన ఘటనల గురించి విన్నాం. అయితే పాకిస్తాన్‌లోని (Pakistan) ఓ చెట్టుకు 125 ఏళ్ల క్రితం శిక్ష పడింది (Tree arrest). ఆ చెట్టు ఇప్పటికీ ఆ శిక్షను అనుభవిస్తూనే ఉంది. ఆ ఘటన గురించి వింటే బ్రిటీష్ అధికారుల ఏకపక్ష, అహంకార పూరిత వైఖరి గురించి ఆశ్చర్యపోక తప్పదు. వారు మనుషులకే కాదు.. చెట్లకు కూడా శిక్ష విధించడం జరిగింది (Tree arrested in Pakistan).

స్వాతంత్ర్యం రావడానికి ముందు పాకిస్థాన్ కూడా భారత్‌లో భాగం అనే సంగతి తెలిసిందే. ప్రస్తుత పాకిస్తాన్‌లోని పెషావర్‌లో (Peshawar) ఉన్న ఓ చెట్టు ఇప్పటికీ గొలుసులతో కట్టేసి ఉంది. బ్రిటీష్ అధికారి (British Officer) జేమ్స్ స్క్విడ్ ఈ చెట్టును 1899 అరెస్ట్ చేయించారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ అధికారిగా పని చేసిన జేమ్స్ స్క్విడ్ ఆ రోజు విపరీతంగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడు పెషావర్‌లోని ఓ పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మత్తులో ఉన్న ఆ అధికారికి తన ముందు చెట్టు నడుస్తున్నట్లు అనిపించింది (Viral).

తన ముందు నడుస్తున్న చెట్టును వెంటనే అరెస్ట్ చేయాలని జేమ్స్ స్క్విడ్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అక్కడ ఉన్న సైనికులు ఆ చెట్టును గొలుసులతో కట్టారు. తరువాతి కాలంలో భారతదేశం స్వాతంత్ర్యం లభించి, పాకిస్తాన్ నూతన దేశంగా ఏర్పడింది. అయినా ఆ చెట్టుకు బంధ విముక్తి లభించలేదు. ఆ చెట్టుకు గొలుసులు వేలాడుతూనే ఉన్నాయి. ఈ చెట్టును బ్రిటిష్‌వారి అణచివేతకు గుర్తు అని అని చాలా మంది భావిస్తారు. ఇది ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా చాలా మందిని ఆకర్షిస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 11:40 AM