Share News

Viral Video: ఇతను మనిషా? మిక్సీ గ్రైండరా? మార్కెట్లో కరెంట్ షాక్ డ్యాన్స్.. చూసిన వాళ్లకు షాక్ కొట్టాల్సిందే..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:14 PM

ఆ మార్కెట్ చాలా బిజీగా ఉంది.. అందరూ తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు.. షాపింగ్ పూర్తయిన వారు ఇంటి దారి పడుతున్నారు.. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు.. ఫ్యాంట్, షర్టు, బూట్లు వేసుకుని కళ్లజోడు పెట్టుకుని ఓ అధికారిలా ఉన్నాడు..

Viral Video: ఇతను మనిషా? మిక్సీ గ్రైండరా? మార్కెట్లో కరెంట్ షాక్ డ్యాన్స్.. చూసిన వాళ్లకు షాక్ కొట్టాల్సిందే..!
Current shock dance

ఆ మార్కెట్ చాలా బిజీగా ఉంది.. అందరూ తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు.. షాపింగ్ పూర్తయిన వారు ఇంటి దారి పడుతున్నారు.. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు.. ఫ్యాంట్, షర్టు, బూట్లు వేసుకుని కళ్లజోడు పెట్టుకుని ఓ అధికారిలా ఉన్నాడు.. అతడు ఉన్నట్టుండి హఠాత్తుగా అక్కడ వెరైటీ డ్యాన్స్ (Current shock dance) ప్రారంభించాడు.. అతడి డ్యాన్స్ (Dance) చూసి చుట్టు పక్కల ఉన్నవారు షాకయ్యారు. ఆ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral Video).


gadekar.kaka అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి మార్కెట్లోకి వచ్చి ఉన్నట్టుండి వణికిపోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత వెనక్కి, ముందుకు దూకడం ప్రారంభించాడు. అతడి చేష్టలు చూసి అందరూ షాకయ్యారు. కొద్దిసేపటి తర్వాత అది డ్యాన్స్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అతడి చేష్టలు చూసి మొదట భయపడిన వారు తర్వాత నవ్వుకున్నారు. అతడి డ్యాన్స్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. 43 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడి శరీరంలో 440 వోల్టుల కరెంట్ ఉన్నట్టుంది``, ``అతడికి మూర్ఛ వ్యాధి ఉన్నట్టుంది``, ``అతడు మనిషా? మిక్సీ గ్రైండరా``, ``అంకుల్ డ్యాన్స్ కంటే అతడి కాన్ఫిడెన్స్ గొప్పగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది.. పిల్ల ఏనుగు వైపు వస్తున్నమొసలిని తల్లి ఏనుగు ఏం చేసిందో చూడండి..


Viral Video: ఎంత పెళ్లైతే మాత్రం మరీ ఇంత ఆనందమా? నడిరోడ్డు మీద వరుడి వింత డ్యాన్స్ చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2024 | 04:14 PM