Share News

Vegetable fruits: ఆశ్చర్యపోకండి.. ఇవన్నీ అసలు కూరగాయలే కాదట.. నిజానికి పండ్లట..

ABN , Publish Date - Dec 08 , 2024 | 02:33 PM

మనకు తెలీకుండానే కొన్ని పండ్లని మనం కూరగాయలని అనుకుంటున్నాం. అవి పండ్లని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Vegetable fruits: ఆశ్చర్యపోకండి.. ఇవన్నీ అసలు కూరగాయలే కాదట.. నిజానికి పండ్లట..

Vegetable fruits: సాధారణంగా మనం వంట చేసుకుని తినేవన్నీ కూడా కూరగాలయలనే అనుకుంటాం. మొక్కల నుండి కోసుకుని తినగలిగిన తియ్యటి రసం నిండినవన్నీ కూడా పండ్లని అనుకుంటాం. అయితే, మనకు తెలీకుండానే కొన్ని పండ్లని మనం కూరగాయలని అనుకుంటున్నాం. అవి పండ్లని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

టమాటాలు:

టమాటాలు.. ప్రతి కూరకూ మంచి రుచిని ఇస్తాయి. ఇవి నిజానికి పండ్ల జాతిలోకి వస్తాయి. కానీ, మనం దీనిని కూరగాయ అని అనుకుంటున్నాం.

క్యాప్సికం:

మనం కారం కోసం కూరల్లో ఎక్కువగా పచ్చిమిర్చిని వేస్తుంటాం. వీటి జాతికి చెందిన క్యాప్సికంలు కూడా నిజానికి పండ్లట. తీపిగా ఉన్న పచ్చిమిర్చిని, క్యాప్సికంలను మనం తక్కువగా వాడతాం. అయితే, పాశ్చాత్య దేశాల్లో తీపిగా ఉన్న క్యాప్సికంలను ఎక్కువగా సలాడ్లలో తింటుంటారు.


గుమ్మడి కాయ:

కుకుర్బిట్‌ కుటుంబానికి చెందిన గుమ్మడి కాయ, దోస కాయ, పుచ్చ కాయలు ఇవన్నీ కూడా పండ్లట. వీటిలో మనం పుచ్చకాయలను తప్పా మిగితా అన్ని కూడా కూరగాయలని భావిస్తాం. కానీ, గుమ్మడికాయలు, దోసకాయలు కూరగాయలు కాదట. ఇవి పండ్ల జాతిలోకి వస్తాయట.

వంకాయలు:

వంకాయలను మనం చాలా రకాలుగా వంట చేసుకుని తింటాం. గుత్తి వంకాయ కూర, వంకాయ పచ్చళ్లు, వంకాయ వేపుళ్లు అంటూ వంకాయలను బోలెడు రకాలుగా వండేసుకుంటుంటాం. అయితే, వంకాయ కూడా నిజానికి పండేనట.

మొక్క జొన్నలు:

మొక్క జొన్నలను మనం ధాన్యపు గింజల విభాగంలోకి చేరుస్తామంటే పొరపాటు పడినట్లు. ఇవీ కూడా పండ్ల కిందకే వస్తాయట. జొన్న పొత్తులు అనేక రంగుల్లో మనకు లభిస్తుంటాయి. అయితే, ఏ కలర్ లో ఉన్నా కూడా ఇవి మాత్రం పండ్ల కుటుంబానికి చెందినవేనట.

Updated Date - Dec 08 , 2024 | 02:33 PM