Share News

Viral: వామ్మో.. టీచర్ మీద ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఎగ్జామ్ పేపర్‌లో స్టూడెంట్ రాసింది చూసి షాకైన టీచర్!

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:26 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ రకరకాల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. ఇటీవలె పరీక్షలు ముగియడంతో చాలా మంది ఉపాధ్యాయులు పేపర్ కరెక్షన్ పనిలో పడ్డారు.

Viral: వామ్మో.. టీచర్ మీద ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఎగ్జామ్ పేపర్‌లో స్టూడెంట్ రాసింది చూసి షాకైన టీచర్!
Viral Answer Sheet

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ రకరకాల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. ఇటీవలె పరీక్షలు (Exams)ముగియడంతో చాలా మంది ఉపాధ్యాయులు (Teacher) పేపర్ కరెక్షన్ పనిలో పడ్డారు. కొందరు విద్యార్థులు రాసిన జవాబులు చూసి టీచర్లకే బుర్రలు తిరిగిపోతున్నాయి. కొందరు టీచర్లు అలాంటి జవాబు పత్రాలను (Viral Answer Sheets) ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


ఓ విద్యార్థి ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం చాలా మందిని ఆకట్టుకుంటోంది. కొన్ని ఆంగ్ల పదాలను ఇచ్చి వాటితో వ్యాఖ్యలను తయారు చేయాలని అడిగారు. ఆ ప్రశ్నలకు జవాబుగా ఓ విద్యార్థి (Student)తన టీచర్‌పై రివేంజ్ తీర్చుకున్నాడు. టీచర్ అనే పదానికి.. మై టీచర్ ఈజ్ ఏ క్రిమినల్ అని రాశాడు. పోలీస్ అనే పదానికి.. పోలీస్, నా టీచర్‌ను పట్టుకోండి అని రాశాడు. అలాగే పైలెట్ అనే పదానికి.. పైలెట్, మా టీచర్‌పై మీ విమానాన్ని ల్యాండ్ చేయండి. ఫైర్ అనే పదానికి, మా టీచర్‌ను కాల్చండి అని రాశాడు.


ఈ సమాధానాలు చూసి పేపర్ దిద్దిన టీచర్ బుర్ర తిరిగిపోయింది. టీచర్ అంటే ఆ విద్యార్థికి ఎంతో పగ ఉందో ఈ జవాబులు చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 30 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వామ్మో.. ఆ టీచర్‌పై ఆ కుర్రాడికి ఎంత పగ ఉందో``, ``ఆ టీచర్ బాగా వేధిస్తున్నారేమో``, ``గురువును గౌరవించడం నేర్పాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఓటరుకు, ప్రజాస్వామ్యానికి పెళ్లి.. వైరల్ అవుతున్న వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్!


Viral Video: వామ్మో.. రస్క్ తింటే రిస్కే.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రస్క్‌లను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 02:52 PM