Share News

Viral Video: ఈ తెలివి తేటలు చదువులో పెడితే.. ఓ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ చూసి నివ్వెరపోయిన టీచర్.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 21 , 2024 | 02:50 PM

ఇటీవలె పరీక్షలు ముగిశాయి. చాలా మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాశారు. ప్రస్తుతం టీచర్లు ఆ పేపర్లను దిద్దే పనిలో ఉన్నారు. అయితే కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో రాసిన సమాధానాలు టీచర్లకు షాకిస్తున్నాయి. తాజాగా ఓ టీచర్‌కు వింత అనుభవం ఎదురైంది.

Viral Video: ఈ తెలివి తేటలు చదువులో పెడితే.. ఓ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ చూసి నివ్వెరపోయిన టీచర్.. ఏం జరిగిందంటే..
Exams

ఇటీవలె పరీక్షలు (Exams) ముగిశాయి. చాలా మంది విద్యార్థులు (Students) ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాశారు. ప్రస్తుతం టీచర్లు (Teacher) ఆ పేపర్లను దిద్దే పనిలో ఉన్నారు. అయితే కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో రాసిన సమాధానాలు టీచర్లకు షాకిస్తున్నాయి. తాజాగా ఓ టీచర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆ టీచర్ దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


quicshorts అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీచర్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారు. ఓ విద్యార్థి కేవలం ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను ఆన్సర్ షీట్‌లో తిరిగి రాశాడు. పేపర్ల మధ్యలో ఓ రూ.200 నోటు పెట్టాడు. ``గురువు గారు కోరుకుంటే నన్ను పాస్ చేస్తారు`` అని రాశాడు. ఆ కుర్రాడు చేసిన పని టీచర్‌కు చాలా కోపం తెప్పించింది. ఆ కుర్రాడికి కేవలం సున్నా మార్కులు మాత్రమే వేశారు (Rs.200 note in Answer sheet).


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్‌కు పైగా లైక్‌లు వచ్చాయి. ఇప్పటివరకు 1.9 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ తెలివితేటలో చదువులో పెట్టి ఉంటే పాస్ అయ్యేవాడేమో``, ``బాబూ.. రూ.200కే పాస్ అయిపోతావా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: గుజరాత్‌లో బయటపడిన 4.7 ఏళ్ల కోట్ల క్రితం నాటి పాము అవశేషాలు.. ఈ పాము కథేంటో తెలిస్తే..!


Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోల్లోని తేడాలను కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 02:50 PM