Sobhita Dhulipala: వారెవ్వా.. బాసికం నుండి వడ్డాణం వరకు.. తెలుగు తనం ఉట్టిపడేలా శోభిత పెళ్లి ఆభరణాలు..
ABN , Publish Date - Dec 10 , 2024 | 11:47 AM
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ఫొటోలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శోభితా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు తనం ఉట్టిపడేలా ధరించిన పెళ్లి ఆభరణాలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ గత వారం ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో తమిళ-బ్రాహ్మణ పద్దతిలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా శోభితా ధూళిపాళ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో తను ధరించిన ఆభరణాలు వారెవ్వా.. తెలుగుదనం అంటే ఇది కదా అనేలా కనిపిస్తున్నాయి.
బాసికం నుంచి వడ్డాణం వరకు..
బాసికం నుండి వడ్డాణం వరకు బంగారు ఆభరణాలలో సాంప్రదాయ తెలుగు వధువుగా శోభితా ధూళిపాళ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఆభరణాలు ఎంతో ప్రత్యేకంగా కనిపించాయి. వధువు ధరించిన బంగారు ఆభరణాలు తెలుగు మూలాలను గుర్తు చేస్తున్నాయి. తలకు కట్టుకున్న బాసికం నుంచి వడ్డాణం వరకు ప్రతి ఒక్కటీ రూబీ, బంగారం, డైమండ్స్‌తో ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలిసింది.
అయితే, పెళ్లిలో శోభిత ధరించి ఆభరణాలు.. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్: I’చిత్రంలోని హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, త్రిష ధరించిన నగలను గుర్తు చేస్తున్నాయి. జీవితాంతం గుర్తుండిపోయేలా తన పెళ్లి ఆభరణాలను శోభితా ధూళిపాళ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్లు తెలిసింది. తన బ్రైడల్ లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి కాస్త హల్ చల్ చేస్తున్నాయి. శోభితా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.