Share News

Viral Video: ఇలాంటి కొడుకు ఉండాలి.. తల్లి, తండ్రిని కూర్చోపెట్టి సైకిల్ తోస్తున్న కుర్రాడు.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 10 , 2024 | 11:20 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది రకరకాల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. రోజువారీ జీవితంలో తమకు ఎదురైన అనుభవాలను, విచిత్ర ఘటనలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని వీడియోలు చాలా మందిని ఆకట్టుకుని వైరల్‌గా మారుతున్నాయి.

Viral Video: ఇలాంటి కొడుకు ఉండాలి.. తల్లి, తండ్రిని కూర్చోపెట్టి సైకిల్ తోస్తున్న కుర్రాడు.. వీడియో వైరల్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది రకరకాల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. రోజువారీ జీవితంలో తమకు ఎదురైన అనుభవాలను, విచిత్ర ఘటనలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని వీడియోలు చాలా మందిని ఆకట్టుకుని వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ చిన్న కుర్రాడు చేస్తున్న పని చాలా మందిని ఎమోషనల్‌కు గురి చేస్తోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి సైకిల్‌పై వెళుతున్నాడు. బ్రిడ్జిపై సైకిల్ (Bicycle) తొక్కడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ వ్యక్తి కొడుకు అయిన చిన్న కుర్రాడు (Son) తన తండ్రికి సహాయం చేయడానికి కిందకు దిగాడు. సైకిల్‌ను వెనుక నుంచి నెడుతున్నాడు. దీంతో ఆ తండ్రి సైకిల్‌ను సులభంగా తొక్కగలిగాడు. ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


@mpanktiya అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2.85 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై జనాలు తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుర్రాడిపై ప్రేమను కురిపిస్తూ కామెంట్లు చేశారు. ``అలాంటి కొడుకు అందరికీ ఉండాలి``, ``వెల్‌డన్ లిటిల్ మ్యాన్``, ``వెరీ ఎమోషనల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇదెక్కడి ట్రిక్కు రా నాయనా.. స్కాన్ చేస్తే బైక్ నుంచి టీ వచ్చేస్తోంది.. నెటిజన్లు ఏమంటున్నారంటే..


Viral: మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రచారం చేస్తున్న అభ్యర్థి.. కారణం ఏంటో తెలిస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 11:20 AM