Signature: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటుందా? ఇలాంటి వాళ్ల స్వభావం ఏంటంటే..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:10 PM
కొందరు సాధారణంగా పేరునే సంతకంగా పెట్టేస్తుంటారు. మరికొందరు మాత్రం పేరును షార్ట్ గా అట్రాక్షన్ గా కలిపిరాతతోనో లేక పేరులో మొదటి అక్షరాలు కనిపించేలాగో సంతకం పెడుతుంటారు. సరిగ్గా గమనిస్తే కొందరు పెట్టిన సంతకంలో కింద రెండు చుక్కలు ఉండటం చూడవచ్చు. ఇది సంతకాన్ని అట్రాక్షన్ గా మారుస్తుందని అందరూ అనుకుంటారు. కానీ

బ్యాంక్ పనుల నుండి వివిధ రకాల ఆఫీసు పనుల వరకు ప్రతి ఒక్కరూ సంతకాన్ని వినియోగిస్తూనే ఉంటారు. కొందరు సాధారణంగా పేరునే సంతకంగా పెట్టేస్తుంటారు. మరికొందరు మాత్రం పేరును షార్ట్ గా అట్రాక్షన్ గా కలిపిరాతతోనో లేక పేరులో మొదటి అక్షరాలు కనిపించేలాగో సంతకం పెడుతుంటారు. సరిగ్గా గమనిస్తే కొందరు పెట్టిన సంతకంలో కింద రెండు చుక్కలు ఉండటం చూడవచ్చు. ఇది సంతకాన్ని అట్రాక్షన్ గా మారుస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇలా సంతకం చివరన ఉండే రెండు చుక్కలు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయట. సంతకం కింద ఉండే రెండు చుక్కల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే..
ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!
సంతకం కింద రెండు చుక్కలు పెట్టేవారు చాలా నమ్మకమైన వ్యక్తులని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వీరు తమ ఉనికిని వ్యక్తం చేయడంలో చాలా స్పష్టంగా ఉంటారు.
సంతకం కింద రెండు చుక్కలు పెట్టే వ్యక్తులు భావోద్వేగాలను వ్యక్తీకరించడంలోనూ, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలోనూ చాలా స్పష్టతతో ఉంటారట. అంతేకాదు ఇలాంటి వ్యక్తులో భావోద్వేగాలు సమతుల్యతో ఉంటాయట. ఇదే వీరిని బ్యాలెన్డ్ వ్యక్తిత్వం కలిగిన వారిగా నిలబెడుతుందట.
సంతకం కింద రెండు చుక్కలు పెట్టే వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారట. ఎవరితో అయినా ఇట్టే సులువుగా కలిసిపోతారట. ఎవరినైనా అందరిలో మెచ్చుకోవాలన్నా ఎలాంటి సంతోచం లేకుండా మెచ్చుకోగలగుతారు. ఈ గుణం వీరిని అందరూ మెచ్చుకునేలా చేస్తుంది.
Cooler: కూలర్ ఎప్పటికీ పాడవకూడదంటే.. ఇలా క్లీన్ చేయండి..!
జీవితంలో వృత్తి విషయాలు అయినా, వ్యక్తిగత జీవితం అయినా నిజాయితీగా ఉండటంలో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారట. ఎప్పుడూ నిజం మాట్లాడతారు. ఈ కారణంగా వీరి పట్ల చాలామందికి గౌరవభావం, నమ్మకం ఎక్కువగా ఉంటుంది.
పని జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలామంది సతమతం అవుతుంటారు. అయితే సంతకం కింద రెండు చుక్కలు పెట్టే వ్యక్తులు మాత్రం ఈ రెండింటిని ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటారు. అంతేకాదు క్రియేటివ్ వర్క్స్ లో వీరు చాలా చాలా మెరుగ్గా ఉంటారు. ఈ కారణంగా నలుగురిలో సెంటరాప్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు.
Raisins: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే.. కానీ దీన్ని ఎవరు తీసుకోకూడదంటే..!
Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.