Share News

Viral Video: ఇలాంటివి రష్యాలోనే సాధ్యం.. ఎలుగుబంటికి స్పూన్‌ ఫీడింగ్.. 6 కోట్ల మంది చూసిన వీడియో..

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:48 PM

ఇటీవలి కాలంలో దుబాయ్‌లోని కొందరు ధనికులు సింహాలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా తమ స్టేటస్ సింబల్ కోసం పెంచుకుంటున్నారు. అయితే ఎలుగు బంటితో సన్నిహితంగా ఉండడానికి ఎంతటి వారైనా భయపడతారు.

Viral Video: ఇలాంటివి రష్యాలోనే సాధ్యం.. ఎలుగుబంటికి స్పూన్‌ ఫీడింగ్.. 6 కోట్ల మంది చూసిన వీడియో..

చాలా మంది తమ ఇళ్లలో జంతువులను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. కుక్కలు, పిల్లలు, పక్షులు మొదలైన వాటిని సంరక్షిస్తూ వాటితో (Pet Animals) అనుబంధం పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో దుబాయ్‌ (Dubai)లోని కొందరు ధనికులు సింహాలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా తమ స్టేటస్ సింబల్ కోసం పెంచుకుంటున్నారు (Pet Lions). అయితే ఎలుగు బంటితో సన్నిహితంగా ఉండడానికి ఎంతటి వారైనా భయపడతారు. ఎందుకంటే అది మనుషులకు చేరువ కాలేదు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి ఎలుగు బంటితో (Pet Bear) అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. దానికి స్పూన్‌తో ఆహారం తినిపిస్తున్నాడు. ఆ ఎలుగు బంటి అతడి పక్కనే నిల్చుని వేగంగా ఆహారం తింటోంది. అతడు ఆహారం తినిపిస్తూనే దానికి ముద్దు పెడుతున్నాడు. చివర్లో ఆ ఎలుగుబంటి కూడా ఆ వ్యక్తికి ముద్దు పెట్టింది. రష్యాలో ఈ వీడియోను చిత్రీకరించారు (Russia). ఎలుగు బంటితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి ధైర్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. panteleenko_svetlana అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

ఈ వైరల్ వీడియోను ఆరు కోట్ల మందికి పైగా వీక్షించడం గమనార్హం. 22 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందలను తెలియజేశారు. ``రష్యాలో ఇలాంటివి సర్వ సాధారణం``, ``రష్యాలో చాలా మంది ఎలుగుబంట్లను పెంచుకుంటారు``, ``ఆహారం వైపు దూసుకుపోకుండా అతడు పెట్టే వరకు ఆ ఎలుగుబంటి సహనంగా ఎదురుచూస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 23 , 2024 | 09:48 PM