Share News

Viral Video: చెప్పులు కుట్టించుకునే వ్యక్తి దగ్గరకు వెళ్లిన రష్యన్ మహిళ.. అతడి ఇంగ్లీష్ విని షాక్!

ABN , Publish Date - May 22 , 2024 | 05:11 PM

రష్యాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియా చుగురోవా ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికాస్ అనే స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తితో ఆమెకు ఎదురైన అనుభవం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Viral Video: చెప్పులు కుట్టించుకునే వ్యక్తి దగ్గరకు వెళ్లిన రష్యన్ మహిళ.. అతడి ఇంగ్లీష్ విని షాక్!
Mariia Chugurova with Cobbler

రష్యా (Russia)కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియా చుగురోవా (Mariia Chugurova) ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికాస్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి (Cobbler)తో ఆమెకు ఎదురైన అనుభవం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వైరల్ వీడియోలో మరియా, వికాస్‌ల మధ్య జరిగిన సంభాషణను చూపించారు. ఆ వీడియో చాలా మంది హృదయాలను గెలుచుకుని నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో మరియా తన తెగిపోయిన చెప్పుతో (Slippers) వికాస్ దగ్గరకు వెళ్లింది. వికాస్ ఆ చెప్పు తీసుకుని కుట్టడం ప్రారంభించాడు. కుడుతూనే ఆమె ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు. తను 26 ఏళ్లుగా అదే వృత్తిలో ఉన్నానని చెప్పాడు. రష్యాలో తెగిన చెప్పును కుట్టించుకునే వీలుండదని మరియా తెలిపింది. కుట్టడం అయిన తర్వాత వికాస్ కేవలం రూ.10 మాత్రమే అడిగాడు. మరియ రూ.20 ఇచ్చి ``ధన్యవాదాలు`` చెప్పి వెళ్లిపోయింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కేవలం మూడు రోజుల్లో ఈ వీడియోను 6.8 కోట్ల మంది వీక్సించారు. 14 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ వ్యక్తి చాలా అమాయకుడిలా ఉన్నాడు``, ``ఆమె ధన్యావాదాలు చెప్పిన తీరు చాలా క్యూట్‌గా ఉంది``, ``ఆయన ఇంగ్లీష్ అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..


Viral Video: దేవుడా.. ఈ వంటకం ఏంటో తెలిస్తే కంట్లో నీళ్లు తిరగాల్సిందే.. అవాక్కవుతున్న నెటిజన్లు!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 05:11 PM