PV Sindhu: పీవీ సింధు హ్యాండ్ ఎంబ్రాయిడరీ లెహంగా సెట్‌ను రూపొందించడానికి 2,350 గంటలు..
ABN , Publish Date - Dec 08 , 2024 | 01:23 PM
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఏ ఫంక్షన్‌కు వెళ్లినా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటారు. ఇటీవల నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వేడుకలోనూ సింధు మరోసారి తన అభిమానులను ఆకట్టుకుంది.
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుని మనమెప్పుడూ క్రీడా దుస్తుల్లో చూస్తుంటాం. కానీ, పలు సందర్భాల్లో సంప్రదాయ దుస్తుల్లోనూ తళుక్కున్న మెరిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వేడుకల్లో సింధు మరోసారి తన అభిమానులను ఆకట్టుకుంది. పింక్ కలర్ లెహంగా ధరించి ఎంతో ప్రత్యేకంగా కనిపించింది.
2,350 గంటల సమయం..
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ మృణాళిని రావు ఈ లెహంగాను ఎంతో అందంగా డిజైన్ చేశారు. అయితే, లెహంగాలో కనిపిస్తున్న పూల ఎంబ్రాయిడరీ చేయడానికి డిజైనర్ కు 2,350 గంటల సమయం పట్టినట్లు తెలుస్తుంది. పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో 'పింకాలిషియస్ వైబ్స్' అంటూ తన ఫొటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన సింధు అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సింధు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశానికి ఎన్నో పతకాలు సాధించిన ఈ తెలుగుతేజం ఇప్పుడు వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతుండడంతో అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ చెబుతున్నారు.
ఉదయ్‌పూర్‌లో వివాహం..
కాగా, పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకట దత్త సాయి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ ఇటీవల ప్రకటించారు. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడబోతోందని.. అందుకే సాధ్యమైనంత తొందరగా తనకు పెళ్లి చేయాలని భావించామని తెలిపారు. డిసెంబర్ 20న సింధు పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని. ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో వైభవంగా పెళ్లి జరగనుందని వెల్లడించారు. అలాగే, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని తెలిపారు.