Share News

Viral News: మూడేళ్ల పాప ఇంట్లో సోఫా సహా అనేకం తింటుంది.. అలర్ట్ చేస్తున్న తల్లి

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:17 PM

మీరెప్పుడైనా సోఫాలు తినే చిన్నారుల గురించి విన్నారా. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటివల ఓ తల్లి(mother) తన మూడేళ్ల కుమార్తెకు(child) ఉన్న అరుదైన అలవాటు గురించి ఓ మీడియా వేదికగా వెల్లడించారు.

Viral News: మూడేళ్ల పాప ఇంట్లో సోఫా సహా అనేకం తింటుంది.. అలర్ట్ చేస్తున్న తల్లి

మీరెప్పుడైనా సోఫాలు తినే చిన్నారుల గురించి విన్నారా. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటివల ఓ తల్లి(mother) తన మూడేళ్ల కుమార్తెకు(child) ఉన్న అరుదైన అలవాటు గురించి ఓ మీడియా వేదికగా వెల్లడించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌(united kingdom)లోని వేల్స్‌లో ఉంటున్న స్టేసీ ఎ హెర్న్(Stacey AHearn) తన మూడేళ్ల కుమార్తె సోఫాలో స్పాంజ్, గోడలపై ప్లాస్టర్‌ను గీసుకుని తీటుందని తెలిపింది. అంతేకాదు ఆమె ఎత్తైన కుర్చీ అంచును నమలడం కూడా చూసినట్లు వెల్లడించింది. చలికాలంలో ఇంట్లో ఫోటో ఫ్రేమ్‌లను పగలగొట్టి గాజు ముక్కలను కూడా తినడానికి ప్రయత్నించిందని ఆమె చెప్పింది.

ఏం చేసినా కూడా తన చిన్నారి తినకూడనివి తినేందుకు ప్రయత్నిస్తుందని ఆమె తెలిపింది. ఆ క్రమంలో జనవరి 2024లో తన పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్లినప్పుడు తనకు పికా(pica) అనే వ్యాధితోపాటు ఆటిజం(autism) ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే పికా వ్యాధి(pica disease) వచ్చిన వారు ఎక్కువగా ఆహారేతర పదార్థాలను కోరుకుంటారని వైద్యులు అన్నారు. మంచు, నేల, కాగితం, బంకమట్టి వంటి ఇతర పోషకాలు లేని పదార్థాలను నములుతారని వెల్లడించారు.


ఈ వ్యాధి రావడానికి పోషకాహార లోపం, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు(doctors) అన్నారు. అయితే సాధారణంగా పిల్లలకు(childrens) ఏదైనా వస్తువులను నోటిలో పెట్టుకునే అలవాటు ఉండేది. కానీ ఈ చిన్నారి విషయంలో మాత్రం అది తీవ్రంగా మారిందని ఆమె తల్లి అన్నారు. ఈ క్రమంలో తన చిన్నారిని ఎల్లప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యాధి(disease) పట్ల మిగతా వారు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: మారిన ట్రెండ్.. బెండీ సమోసా చుశారా?

Updated Date - Mar 18 , 2024 | 04:34 PM