Share News

Peregrine falcon: గద్దను సైతం భయపెట్టే పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షి గురించి తెలుసా..!!

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:53 AM

ఈ పక్షులు ప్రతి సంవత్సరం 15,500 మైళ్ల వరకు ఎగరగలవు. గూడు నుంచి దూరంగా పెరెగ్రైన్ ఫాల్కన్లు ఒంటరిగా ఉంటాయి, చాలా దూరం ప్రయాణిస్తాయి అందుకే వీటికి పెరెగ్రైన్ అంటే సంచారకుడు, యాత్రికుడు అనే పేరు వచ్చింది.

Peregrine falcon: గద్దను సైతం భయపెట్టే పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షి గురించి తెలుసా..!!
peregrine falcons

పెరెగ్రైన్ ఫాల్కన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవులు, ఇవి ఎరను పట్టుకునే ప్రయత్నంలో ఆకాశంనుంచి డైవ్ చేస్తున్నప్పుడు 321 Kphఅంటే దాదాపు 200Mph వేగంతో నేలకు చేరతాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే పక్షుల జాబితాలో చేరాయి. ఈ అరుదైన పక్షులు జవెనైల్ పెరెగ్రైన్ లు ముదురు గోధుమ రంగు ఈకలతో, శరీరం దిగువ భాగంలో చారలు, వాటి ఈకలకు కాస్త గ్రద్ధను పోలి ఉంటాయి.

వీటి నివాసాలు..

పెరెగ్రైన్ ఫాల్కన్లు ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో నివసిస్తాయి. చిత్తడి నేలలు, వ్యవసాయ భూములలో వేటాడతాయి. ఇవి సంతానోత్పత్తి కాలంలో సముద్రపు తీర కొండలు, క్వారీ, పట్టణ ప్రాంతాల్లోని భవనాలపై గూళ్ళను తయారు చేస్తాయి.

పెరెగ్రైన్ ఫాల్కన్ లు ఏడాది పొడవునా ఉంటాయి. ఈ పక్షులు ప్రతి సంవత్సరం 15,500 మైళ్ల వరకు ఎగరగలవు. గూడు నుంచి దూరంగా పెరెగ్రైన్ ఫాల్కన్లు ఒంటరిగా ఉంటాయి, చాలా దూరం ప్రయాణిస్తాయి అందుకే వీటికి పెరెగ్రైన్ అంటే సంచారకుడు, యాత్రికుడు అనే పేరు వచ్చింది. పెరెగ్రైన్ ఫాల్కన్లు ప్రధానంగా తెల్లవారుజామున, సాయంత్రాలలో వేటాడతాయి. అత్యంత వేగంగా నేల మీద ఉండే జీవులను వేటాడగలవు. దాదాపు 300 కిలో మీటర్ల వేగంతో నేలను చేరతాయి. ఒక వేళ ఎరను మోయడం బరువనిపిస్తే మాత్రం నేల మీదనే తింటాయి.


పెరెగ్రైన్ పక్షి విశేషాలు..

సహజమైన డిజైన్‌తో చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ పక్షులను ప్రేరణగా తీసుకునే మొదటి జెట్ ఇంజిన్‌ల రూపకల్పన జరిగింది.

పెరెగ్రైన్ ఫాల్కన్లు అద్బుతమైన బైనాక్యూలర్ దృష్టిని కలిగి ఉంటాయి. మనుషుల కంటే కూడా ఎనిమిది రెట్లు మెరుగ్గా వీటి కంటి చూపు ఉంటుంది.

మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఎరను గర్తించగలదు.

పెరెగ్రైన్‌లు తమ తలని ఒక కోణంలో తిప్పడం ద్వారా చాలా స్పష్టంగా చూడగలవు,

అందుకే పెరెగ్రైన్ ఫాల్కన్‌లు సాధారణంగా తమ ఆహారం వైపు వంపులో ఎగురుతాయి.

ఇది కూడా వాటిని వేగంగా ఎగరడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది డ్రాగ్‌ని తగ్గిస్తుంది.

ఆడ పక్షి ఏప్రిల్‌లో 3-4 గుడ్లు పెడుతుంది. వాటిని సుమారు 30 రోజులు పొదుగుతుంది.

Updated Date - Jan 04 , 2024 | 11:53 AM