Share News

Watch Video: పెళ్లి పీటల మీద కూర్చున్న వధూవరులు.. రొమాంటిక్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న పురోహితుడు..

ABN , Publish Date - Feb 27 , 2024 | 06:33 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Watch Video: పెళ్లి పీటల మీద కూర్చున్న వధూవరులు.. రొమాంటిక్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న పురోహితుడు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ (Wedding) నడుస్తోంది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Wedding Videos) అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు హృదయాన్ని తాకుతాయి, మరికొన్ని నవ్విస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పురోహితుడు (Pandit) చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. అతడి ట్యాలెంట్‌కు అతిథులందరూ ఫిదా అయ్యారు.

పెళ్లి పీటల మీద వివాహ వేడుక కోసం వధూవరులు కూర్చున్నారు. వారి ఎదురుగా కూర్చున్న పురోహితుడు మంత్రాలకు బదులుగా హిందీ సినిమా రొమాంటిక్ సాంగ్ పాడాడు. ``తుజే దేఖా తో యే జానా సనమ్`` అంటూ షారూక్, కాజోల్‌ల ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్‌తో అలరించాడు. అతడి సింగింగ్ ట్యాలెంట్‌ను వధూవరులతో పాటు అతిథులందరూ ఆస్వాదించారు. @ChapraZila ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 36 వేల మందికి పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఆ వీడియోలోని పురోహితుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``అలాంటి పండిట్ జీ ఉంటే, పెళ్లి రాత్రి ఆహ్లాదంగా గడిచిపోతుంది``, ``నేను అతణ్నీ నా పెళ్లికి ఆహ్వానిస్తాను``, ``పండిట్ జీ బహుశా మొదట గాయకుడు కావాలని అనుకుని ఉంటాడు``, ``ఆయన చాలా సరదాగా ఉన్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 06:33 PM