Share News

Optical Illusion: ఈ పోటీలో గెలిచేవారెందరు? 9 సెకెన్లలో గులాబీల గుత్తిలో 6ముఖాలను గుర్తుపట్టాలి.. ఛాలెంజ్ తీసుకోండి చూద్దాం!

ABN , Publish Date - Feb 02 , 2024 | 02:43 PM

కేవలం 9సెకెండ్లలో ఈ పువ్వులలో దాగున్న 6ముఖాలు కనిపెడితే మీ కంటి చూపు బేషుగ్గా ఉన్నట్టే..

Optical Illusion: ఈ పోటీలో గెలిచేవారెందరు? 9 సెకెన్లలో గులాబీల గుత్తిలో 6ముఖాలను గుర్తుపట్టాలి.. ఛాలెంజ్ తీసుకోండి చూద్దాం!

మెదడుకు, కంటికి పదునుపెట్టే ఎన్నో రకాల ఛాలెంజ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దృశ్యబ్రాంతి చిత్రాలు చాలా పెద్ద సవాల్ ముందుంచుతాయి. వీటనే ఆప్టికల్ ఇల్యూసన్ అని అంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూసన్ కు చెందిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లకు ఛాలెంజ్ విసురుతోంది. దీని వైపు ఓ లుక్కేస్తే..

ఆప్టికల్ ఇల్యూసన్ చాలా సరదాగా ఉన్నా మెదడుకు, కంటికి భలే మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. చుడగానే కంటికి కనిపించేది ఒకటైతే.. బాగా గమనించిన తరువాత అందులో కనిపించే విషయాలు వేరు ఉంటాయి. అలాంటిదే ఈ గులాబీ పూల గుత్తి ఫొటో. ఫొటోలో గులాబీ పువ్వుల గుత్తి కనిపిస్తుంది. ఇందులో మొగ్గలు, విరిసిన పువ్వులు కూడా ఉన్నాయి. మంటి కళాకృతిలో ఉన్న ఈ గులాబీ పువ్వులతో 6 మనిషి ముఖాలు అంతర్గతంగా డిజైన్ చేశారు. బాగా గమనిస్తే తప్ప ఈ ముఖాలు కనిపించవు. మొత్తం 6 ముఖాలను కేవలం 9 సెకెన్లలో కనిపెట్టడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం.

fc2.jpg

ఇది కూడా చదవండి: Pressure Cooker: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకండి!


9 సెకెన్లలో 6 ముఖాలను గుర్తించిన వారి కంటి చూపు అద్బుతం అని అంటున్నారు. అయితే చాలామంది ఈ పరీక్షలో విఫలమవుతున్నారు. 9సెకెన్లలో కేవలం 2 లేదా 3 ముఖాలను మాత్రమే గుర్తుపడుతున్నవారు ఉన్నారు. మిగిలినవి గుర్తుపట్టలేక చేతులెత్తేస్తున్నారు. మీరూ కనిపెట్టగలరేమో ఓసారి ట్రై చెయ్యండి.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 02:44 PM