Share News

Tyres Puncture: ముంబై హైవే మీద ఏం జరిగింది? అర్ధరాత్రి 50 వాహనాలకు ఒకేసారి పంక్చర్.. ఆ తరువాత..

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:40 PM

సోమవారం అర్ధరాత్రి ముంబై-నాగపూర్ హైవేపై విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ హైవేపై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 50 వాహనాల టైర్లు వరుసగా పంక్చర్ అయ్యాయి. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో వాషిం జిల్లాలోని మాలెగావ్, వనోజా టోల్ ప్లాజాల మధ్య ఈ ఘటన జరిగింది.

Tyres Puncture: ముంబై హైవే మీద ఏం జరిగింది? అర్ధరాత్రి 50 వాహనాలకు ఒకేసారి పంక్చర్.. ఆ తరువాత..
50 vehicles got punctured on Mumbai-Nagpur Highway

సోమవారం అర్ధరాత్రి ముంబై-నాగపూర్ హైవేపై విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ హైవేపై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 50 వాహనాల టైర్లు వరుసగా పంక్చర్ (Puncture) అయ్యాయి. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో వాషిం జిల్లాలోని మాలెగావ్, వనోజా టోల్ ప్లాజాల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కావడంతో వాహనదారులు రాత్రంతా హైవేపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది (Mumbai-Nagpur Highway).


ముంబై-నాగ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను సమృద్ధి మహామార్గ్ అని కూడా పిలుస్తారు. ముంబయి-నాగ్ పూర్ ను కలుపుతూ ఈ రహదారిని నిర్మించారు. ఇది దేశంలోని అతి పొడవైన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుల్లో ఒకటి. సోమవారం రాత్రి ఈ రహదారిలో ప్రయాణించిన రకరకాల వాహనాల టైర్లు పంక్చర్‌కు గురయ్యారు. కార్లు, లారీలు, భారీ ట్రక్కులు.. ఇలా అన్నీ టైర్లకు పంక్చర్లు పడ్డాయి. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓ ఇనుప బోర్డు విరిగిపోయి రోడ్డు మీద పడిపోయింది. దాని మీద నుంచి వెళ్లిన వాహనాల టైర్లు అన్నీ పంక్చర్ అయిపోయాయని పోలీసులు భావిస్తున్నారు.


హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు అనేక ఇబ్బందులు పడ్డారు. కాగా, ఒకేసారి 50 వాహనాలకు పంక్చర్ కావటం ప్రమాదవశాత్తూ జరిగిందా?, లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2024 | 05:40 PM