Share News

Viral Video: ఈ కోతులు నిజమైన యాక్షన్ హీరోలు.. ఎలక్ట్రిక్ వైర్లతో పెద్ద బిల్డింగ్‌లపై సాహసం..!

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:04 PM

కోతుల నుంచే మనుషులు పుట్టుకొచ్చారంటారు. మనుషులకు కోతులు ఆదిమ రూపం అంటుంటారు. అందుకే కోతులకు, మనషులకు మధ్య చాలా సారూప్యాలు కనిపిస్తుంటాయి. మనుషులు చేసే చాలా విన్యాసాలను కోతులు కూడా చేస్తుంటాయి.

Viral Video: ఈ కోతులు నిజమైన యాక్షన్ హీరోలు.. ఎలక్ట్రిక్ వైర్లతో పెద్ద బిల్డింగ్‌లపై సాహసం..!
Monkeys Using Electric Cables As Zip-Line

కోతుల (Monkey) నుంచే మనుషులు పుట్టుకొచ్చారంటారు. మనుషులకు కోతులు ఆదిమ రూపం అంటుంటారు. అందుకే కోతులకు, మనషులకు మధ్య చాలా సారూప్యాలు కనిపిస్తుంటాయి. మనుషులు చేసే చాలా విన్యాసాలను కోతులు కూడా చేస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Monkey videos) చూస్తే కోతి గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని హల్‌చల్ చేస్తోంది (Viral Video).


thefunnystatus అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద బిల్డింగ్ పై చాలా కోతులు వరుసగా ఉన్నాయి. అందులో ఓ కోతి ఎలక్ట్రిక్ వైర్లపై (Electric Cables) కూర్చుని జారుకుంటూ సమీపంలోని చెట్టు మీదకు వెళ్లిపోయింది. ఆ బిల్డింగ్ పైనున్న మరో కోతి కూడా అలాగే ఆ ఎలక్ట్రిక్ వైర్ల సహాయంతో కిందకు జారుకుంటూ వచ్చేసింది. ఆ బిల్డింగ్ మీద ఉన్న మొత్తం కోతులన్నీ అదే తరహాలో కిందకు వస్తున్నట్టు ఉన్నాయి. ఆ కోతి చేష్టలను సమీపంలోని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. 42 వేల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``నాకు ``ఖత్రోంకీ ఖిలాడీ`` సినిమా గుర్తుకువస్తోంది``, ``ఫ్రీ ఫైర్ స్క్వాడ్``, ``ఆ కోతుల తెలివితేటలకు సెల్యూట్``, ``జైశ్రీరామ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వంట గదిలో పని చేసుకుంటుండగా పేలిన సిలిండర్.. అదృష్టం ఏంటంటే..


Viral Video: తెలివి అంటే ఇదీ.. ఈ ఇటుక కూలర్ ముందు ఏసీ కూడా బలదూర్.. ఎలా సెట్ చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2024 | 03:04 PM