Share News

Funny: ``మా అమ్మకు నువ్వు నచ్చావ్`` అంటూ అమ్మాయి మెసేజ్.. బాయ్‌ఫ్రెండ్ రిప్లై చూస్తే నవ్వాగదు!

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:09 PM

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్ చూస్తే ఎంతటి వారైనా నవ్వకుండా ఉండలేరు. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన మెసేజ్, దానికి అతడి రిప్లై చాలా ఫన్నీగా ఉంది.

Funny: ``మా అమ్మకు నువ్వు నచ్చావ్`` అంటూ అమ్మాయి మెసేజ్.. బాయ్‌ఫ్రెండ్ రిప్లై చూస్తే నవ్వాగదు!

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ (Viral) అవుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని పోస్ట్‌లు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని పోస్ట్‌లు మనల్ని నవ్విస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్ చూస్తే ఎంతటి వారైనా నవ్వకుండా ఉండలేరు (Funny). ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ (Boyfriend)కు పంపిన మెసేజ్, దానికి అతడి రిప్లై చాలా ఫన్నీగా ఉంది. ఆ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. Darshannn అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ పోస్ట్ షేర్ అయింది.

వైరల్‌ అవుతున్న ఆ పోస్ట్‌లో సంభాషణ ఇద్దరు ప్రేమికుల మధ్యన జరిగినట్టు తెలుస్తోంది. ఆ వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌లో అమ్మాయి ``రాహుల్.. మమ్మీకి నువ్వు చాలా నచ్చావు`` అని తన బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్ పంపించి. దానికి ఆ యువకుడు రిప్లై ఇస్తూ.. ``ఆంటీని పక్కన పెట్టు రియా.. నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాన``ని రిప్లై ఇచ్చాడు. ఈ ఫన్నీ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2.2 లక్షల మందికి పైగా ఈ పోస్ట్‌ను వీక్షించారు. 5.6 వేల మందికి పైగా ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``రాహుల్ తన వాగ్ధానాన్ని ఎప్పటికీ ఉల్లంఘించడు``, ``రాహుల్ చాలా నాటీ``, ``రాహుల్ మంచి అవకాశాన్ని కోల్పోయారు``, ``ఎప్పుడూ రాహుల్‌కే మంచి అవకాశాలు వస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు

Updated Date - Feb 12 , 2024 | 06:09 PM