Share News

Valentine`s Day: ప్రియుడితో కలిసి లంచ్.. సడన్‌గా ప్రత్యక్షమైన అమ్మ.. ఆ తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 07:40 PM

వాలంటైన్ డే సందర్భంగా ఓ అమ్మాయి తన ప్రియుడితో కలిసి లంచ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ విషయం ఆమె తల్లికి తెలిసిపోయింది. ఆమె నేరుగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లింది.

Valentine`s Day: ప్రియుడితో కలిసి లంచ్.. సడన్‌గా ప్రత్యక్షమైన అమ్మ.. ఆ తర్వాతేం జరిగిందంటే..

ప్రస్తుతం అంతటా వాలంటైన్స్ డే (Valentine`s Day) మూడ్ అలుముకుని ఉంది. ప్రేమికులు ఈ రోజును ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. గతేడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాలంటైన్ డే సందర్భంగా ఓ అమ్మాయి తన ప్రియుడితో (Lover) కలిసి లంచ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ విషయం ఆమె తల్లికి (Mother) తెలిసిపోయింది. ఆమె నేరుగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లింది.

రెస్టారెంట్‌లో తన కూతురితో కలిసి ఉన్న యువకుడిపై ఆమె దాడికి దిగింది. చెప్పు తీసి ఆ యువకుడిని కొట్టింది. ప్రియుడిని కాపాడేందుకు అమ్మాయి రంగంలోకి దిగింది. దీంతో ఆమె కూతురిని కూడా చెప్పుతో కొట్టింది. గట్టిగా అరుస్తూ ఇద్దరికీ చెప్పు దెబ్బలు రుచి చూపించింది. అక్కడ ఉన్న వారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.9 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఆ వైరల్ వీడియోను 1.7 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``వారిద్దరూ మేజర్లు, ఆ తల్లి అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది``, ``30 ఏళ్ల కిందట ఇలాంటి ప్రవర్తనను అంగీకరించేవారేమో. ఇప్పుడు ఇది అనాగరికం``, ``కూతురు తన నమ్మకాన్ని బ్రేక్ చేసిందనే కోపం కనబడుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 07:40 PM