Share News

Watch Video: వామ్మో.. ఇతడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 17 , 2024 | 06:54 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది భయపడేది పాములకే. పాము ఉందని తెలిస్తే చాలు అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే కొద్ది మంది మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు.

Watch Video: వామ్మో.. ఇతడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి..

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది భయపడేది పాములకే (Snakes). పాము ఉందని తెలిస్తే చాలు అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే కొద్ది మంది మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. చూడడానికే భయం వేసే పాములను పట్టుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో (Snake Video) వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారీ సర్పాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

sarpmitra.akashjadhav అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను (King Cobra) చేతులతో పట్టుకుని పైకి లేపాడు. ఆ వ్యక్తికి దాదాపు రెట్టింపు సైజ్‌లో ఆ కింగ్ కోబ్రా ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పం కింగ్ కోబ్రా. అలాంటిది ఆ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఆ పామును పట్టుకుని తన కంటే పైకి ఎత్తాడు. ఆ పాము దాడి చేయకుండా కామ్‌గా ఉండిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ వీడియోను 29 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ``చాలా భయంకరంగా ఉంది``, ``ఇది చాలా రిస్కీ.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రదర్``, ``ఓ మైగాడ్.. ఇది చాలా ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 06:54 PM