Share News

Shocking: వామ్మో.. 17 రోజులుగా పచ్చి మాంసమే తింటున్నాడు.. అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..

ABN , Publish Date - Feb 05 , 2024 | 09:00 PM

అమెరికాకు చెందిన జాన్ అనే వ్యక్తి పచ్చి మాంసం తినే ప్రయోగాన్ని 17 రోజుల క్రితం ప్రారంభించాడు. పచ్చి కోడి మాంసాన్ని కేవలం ఉప్పు, కారం జల్లుకుని కెచప్ వేసుకుని తినేస్తున్నాడు.

Shocking: వామ్మో.. 17 రోజులుగా పచ్చి మాంసమే తింటున్నాడు.. అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..

సాధారణంగా ఈ ప్రపంచంలో రెండు రకాల ఆహారపు అలవాట్లు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఒకరు శాకాహారులు, మరొకరు మాంసాహారులు. ఈ రెండే కాకుండా చాలా కొద్ది మంది ఆహారంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి తన వింత ఆహారపు అలవాటు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి పచ్చి మాంసం (Raw Meat) తినేస్తున్నాడు. జనవరి 19 నుంచి కేవలం పచ్చి మాంసాన్నే తింటున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

అమెరికాకు చెందిన జాన్ అనే వ్యక్తి పచ్చి మాంసం తినే ప్రయోగాన్ని 17 రోజుల క్రితం ప్రారంభించాడు. పచ్చి కోడి మాంసాన్ని కేవలం ఉప్పు, కారం జల్లుకుని కెచప్ వేసుకుని తినేస్తున్నాడు. అతను సైన్స్ ప్రయోగంలో భాగంగా ఇలా చేస్తున్నాడు. దీనికి అతను ``రా చికెన్ ఎక్స్‌పెరిమెంట్`` అని పేరు పెట్టాడు. పచ్చి చికెన్ తింటున్న వీడియోలను జాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. 17 రోజుల నుంచి పచ్చి మాంసం తింటున్నా తన ఆరోగ్యంలో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదని చెప్పాడు.

పచ్చి కోడి మాంసం తినడం వల్ల డయేరియా లేదా చిన్నపాటి కడుపు నొప్పి వంటి సమస్యలు మాత్రమే వస్తాయని జాన్ తెలిపాడు. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు స్పందించారు. కొందరు అతడి ప్రయోగాన్ని ప్రశంసించారు. మరికొందరు మాత్రం అలాంటివి చేయవద్దని హెచ్చరించారు. ``పచ్చి మాంసం తింటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది`` అంటూ కామెంట్లు చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 09:00 PM