Share News

Watch Video: రెండు ఎద్దుల మధ్యకు భల్లాల దేవలా వెళ్లాడు.. చివరకి అతడి పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:55 PM

రెండు ఎద్దులు ఫైటింగ్‌కు దిగితే మామూలుగా ఉండదు. రెండు భారీ జంతువులు గొడవకు దిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే. లేకపోతే వాటి మధ్య ఇతరులు నలిగిపోతారు.

Watch Video: రెండు ఎద్దుల మధ్యకు భల్లాల దేవలా వెళ్లాడు.. చివరకి అతడి పరిస్థితి ఏమైందో చూడండి..

సాధారణంగా రెండు ఎద్దులు (Bulls) ఫైటింగ్‌కు దిగితే మామూలుగా ఉండదు. రెండు భారీ జంతువులు గొడవకు దిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే. లేకపోతే వాటి మధ్య ఇతరులు నలిగిపోతారు. అయితే మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు ఎద్దులు గొడవపడుతుంటే మధ్యలోకి వెళ్లిన వ్యక్తి తగిన మూల్యం చెల్లించాడు. అనవసర విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు (Bulls Fight).

@Dharmeshspandey అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో నడిరోడ్డు మీద రెండు ఎద్దులు గొడవకు సిద్ధమవుతున్నాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి వాటి దగ్గరకు వెళ్లి హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు. ఒక ఎద్దు తోక పట్టుకున్నాడు. అయినా అవి దూరం జరగలేదు. దీంతో వేరే ఎద్దు దగ్గరకు వెళ్లి దాని తోక పట్టుకున్నాడు. కొద్ది సేపు ఊరుకున్న ఆ ఎద్దు హఠాత్తుగా వెనక్కి తిరిగి అతడిని కొమ్ములతో ఎత్తి పడేసి పారిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా రాజ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``శాంతి దూతగా వెళ్లి గాల్లోకి ఎగిరిపోయాడు``, ``భల్లాల దేవుడికి తగిన శాస్తి జరిగింది``, ``మంచి వ్యక్తితో అంత దురుసుగా ప్రవర్తించవచ్చా`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 03:55 PM