Share News

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!

ABN , Publish Date - Jan 23 , 2024 | 10:00 PM

Ram Lalla In Ravana’s Village: 500 ఏళ్ల నాటి భారతీయుల కల నిన్నటితో(జనవరి 22, 2024) తీరింది. ఇన్నాళ్లు గుడారం లాంటి మందిరంలో తలదాచుకున్న రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలోకి అడుగు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను మించి వేడుకలు నిర్వహించారు జనాలు. తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి రాములోరికి స్వాగతం పలికారు భక్త జనులు.

Ram and Ravan in One Temple: ఒకే గుడిలో రాముడు, రావణుడు.. ఆ పురాతన ఆలయం ఎక్కడుందంటే..!
Ram and Ravan in One Temple

నోయిడా, జనవరి 23: 500 ఏళ్ల నాటి భారతీయుల కల నిన్నటితో(జనవరి 22, 2024) తీరింది. ఇన్నాళ్లు గుడారం లాంటి మందిరంలో తలదాచుకున్న రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలోకి అడుగు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను మించి వేడుకలు నిర్వహించారు జనాలు. తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి రాములోరికి స్వాగతం పలికారు భక్త జనులు. సోమవారం నాడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తవగా.. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు. దాంతో బాల రాముడి దర్శనం కోసం దేశం నలు మూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు.

అయితే, అయోధ్య మాదిరిగానే.. మరో చారిత్రక మందిరం మన దేశంలో ఉంది. జనవరి 22న రామయ్య స్వామి అయోధ్యలోనే కాదు.. మరో చారిత్రక దేవాలయంలోనూ కొలువుదీరారు. అయోధ్య మాదిరిగానే.. ఈ గుడి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. అదే నోయిడా సమీపంలో బిస్రాఖ్ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం. ఈ ఆలయంలో శివుడితో పాటు.. రావణుడిని కూడా పూజిస్తారు భక్తులు. అయితే, రావణుడి ఉన్న ఈ ఆలయంలోనే.. తాజాగా శ్రీరాముడిని కూడా ప్రతిష్ఠించారు ఆ ఊరి ప్రజలు.

నోయిడాలోని శివాలయం స్పెషాలిటీ ఇదే..

అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. బిస్రాఖ్ గ్రామంలో గల శివాలయంలో భక్తులు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బిస్రాఖ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శివుడితో పాటు.. లంకాపతి రావణుడి విగ్రహం కూడా ఉండటం, రావణుడికి భక్తులు పూజలు చేయడం విశేషం.

బిస్రాఖ్ గ్రామంలో పురాతన శివాలయం..

బిస్రాఖ్ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం రావణుడి జన్మస్థలంగా పరిగణిస్తారు. అందుకే.. ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ రావణుడు, శివుడిని ప్రతిష్ఠించారు. రావణుడి తండ్రి విశ్వ వసు బ్రహ్మ ఎనిమిది చేతులతో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారట. ఇకపోతే, బిస్రాఖ్‌లోని శివాలయంలో ఎనిమిది చేతులు గల శివలింగాన్ని పూజించి, రావణుడు వరం పొందారని చెబుతున్నారు అక్కడి పూజారులు. రావణుడు ఇక్కడ తపస్సు చేయగా.. సంతోషించిన శివుడు ఆయన కోరిన వరం ఇచ్చారని చెబుతున్నారు. ఆ తదనంతర కాలంలో ఇక్కడ రావణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రజలు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రశస్థి.

బిస్రాఖ్ గ్రామంలోనూ చారిత్రాత్మక ఘట్టం..

జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో రామయ్య కొలువుదీరినట్లుగా.. నోయిడా సమీపంలోని చారిత్రాత్మక శివాలయంలోనూ రామయ్య తొలిసారి కొలువుదీరాడు. ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు తొలిసారి శ్రీరాముడిని శివాలయంలో ప్రతిష్ఠించడంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇందుకు కారణం ఇక్కడ రావణుడు కూడా పూజించబడటం. రాముడు, రావణుడు ఒకే ఆలయంలో కొలువుదీరి.. భక్తులచే పూజలందుకోడం ఇక్కడి ప్రత్యేకగా చెప్పుకోవచ్చు.

రాజస్థాన్ నుంచి విగ్రహాలు..

ఆలయ ప్రధాన పూజారి మహంత్ రాందాస్ ఆధ్వర్యంలో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలను రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకువచ్చారు.

Updated Date - Jan 23 , 2024 | 10:00 PM