Share News

Emotional Video: తండ్రి మీద ఆ చిన్న పాపకు ఎంతో ప్రేమో చూశారా? వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు!

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:29 PM

తండ్రీకూతుళ్లకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.

Emotional Video: తండ్రి మీద ఆ చిన్న పాపకు ఎంతో ప్రేమో చూశారా? వీడియో చూసి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు!

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంతో మనోహరంగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిలకు తన తండ్రి (Father) దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది. తండ్రీకూతుళ్లకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఓ చిన్న పాప (Daughter) తన తండ్రికి ఆహారం తినిపిస్తున్న వీడియో చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతోంది (Emotional Video).

@dc_sanjay_jas అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు డోర్ వద్ద కూర్చున్నాడు. పక్కనే అతడి చిన్నారి కూతురు నిలబడి ఉంది. ఆ పాప తన చేతిలో ఉన్న ఆహారాన్ని తండ్రి నోటిలో పెడుతోంది. రైలులో ఉన్న వ్యక్తి ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``కేవలం కూతుళ్ల వల్ల తండ్రి పోరాటాల ప్రయాణం ఆహ్లాదంగా మారుతుంద``ని ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఇప్పటివరకు 13 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేశారు. ``కుమార్తెలు లక్ష్మీ దేవి ప్రతిరూపాలు``, ``కూతుళ్లను కలిగి ఉండడం ఏ తండ్రికైనా గొప్ప బలం``, ``తల్లి లాగానే కూతురు కూడా``, ``చాలా ఎమోషనల్ వీడియో``, ``కల్మషం లేని ప్రేమ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 08:29 PM