Share News

Viral Video: సింహం నిద్రపోతుంటే దాని పిల్లలు ఏం చేస్తున్నాయో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:27 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటాయి.

Viral Video: సింహం నిద్రపోతుంటే దాని పిల్లలు ఏం చేస్తున్నాయో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు (Animal Videos) చాలా మందిని ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం (Lion) పిల్లలు చేస్తున్న చేష్టలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. ఆ యూట్యూబ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Lion videos).

దక్షిణాఫ్రికాలోని పుంబా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. సిస్టమ్ హెడ్ రేంజర్‌గా ఉన్న కామెరాన్ స్మిత్ ఈ వీడియోను రికార్డు చేశారు. ``పుంబాలో ఒక సాధారణ రోజు. సింహం విశ్రాంతి తీసుకుంటోంది. దాని పిల్లలు తండ్రి తోకతో ఆడుకుంటున్నాయి`` అని స్మిత్ పేర్కొన్నారు. సింహం గడ్డిలో నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుండగా, దానిని డిస్ట్రబ్ చేసేందుకు మూడు సింహం పిల్లలు (Lion Cubs) ప్రయత్నిస్తున్నాయి. తోక పైకి, కిందకు ఊగుతుండగా దాని పట్టుకోవడానికి ప్రయత్నించాయి.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``చాలా క్యూట్ వీడియో``, ``తండ్రి నిద్రను డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు``, ``ఆ సింహం పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 03:27 PM