Viral Video: ఈ కుర్రాడి ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. చిరుత ఎలా బంధించాడో చూడండి..
ABN , Publish Date - Mar 06 , 2024 | 09:02 PM
అడవి మృగాలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అవి కనబడితే చాలు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటిది నేరుగా మన ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది. ఓ బాలుడికి అలాంటి పరిస్థితే ఎదురైంది.

అడవి మృగాలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అవి కనబడితే చాలు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటిది నేరుగా మన ముందు నుంచి ఓ చిరుత (Leopard) నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది. ఓ బాలుడికి అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఆ కుర్రాడు పెద్దగా కంగారు పడకుండా ఆ చిరుతను గదిలో పెట్టి తలుపు వేసి బయటకు వెళ్లిపోయాడు (Boy locked Leopard). ఆ దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.
మహారాష్ట్రలోని (Maharashtra) మాలెగావ్‌లోని ఓ కల్యాణ మండపంలో మోహిత్ విజయ్ అనే 12 ఏళ్ల కుర్రాడు టేబుల్‌పై కూర్చుని మొబైల్‌లో గేమ్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ చిరుత పులి లోపలికి ప్రవేశించింది. గేమ్ ఆడుకుంటున్న కుర్రాడు ఆ పులిని చూశాడు. పెద్దగా హైరానా పడకుండా సైలెంట్‌గా టేబుల్ మీద నుంచి కిందకు దిగి బయటకు నడిచి తలుపు దగ్గరకు వేసేశాడు. బయటకు వెళ్లి అందరికీ విషయం చెప్పాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. చిరుతను చూసి భయపడకుండా, కేకలు పెట్టకుండా కఠిన పరిస్థితిని చాలా సులభంగా ఎదుర్కొన్న కుర్రాడి సమయస్పూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు.