Share News

Viral Video: పార్ట్‌నర్‌ చనిపోవడంతో కన్నీరుమున్నీరైన కోలా.. గుండెల్ని పిండేస్తున్న వీడియో

ABN , Publish Date - Feb 25 , 2024 | 07:19 PM

ఆత్మీయులను కోల్పోయిన బాధ మనుషులకే కాదు మూగ జీవాలకూ ఉంటుంది. అలాంటి హృదయాన్ని ద్రవింపజేసే సంఘటన ఓ అడవిలో జరిగింది. పార్ట్‌నర్‌ని కోల్పోయిన ఓ కోలా(Koala) దాని కళేబరాన్ని హత్తుకుని ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: పార్ట్‌నర్‌ చనిపోవడంతో కన్నీరుమున్నీరైన కోలా.. గుండెల్ని పిండేస్తున్న వీడియో

సిడ్నీ: ఆత్మీయులను కోల్పోయిన బాధ మనుషులకే కాదు మూగ జీవాలకూ ఉంటుంది. అలాంటి హృదయాన్ని ద్రవింపజేసే సంఘటన ఓ అడవిలో జరిగింది. పార్ట్‌నర్‌ని కోల్పోయిన ఓ కోలా(Koala) దాని కళేబరాన్ని హత్తుకుని ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సదరు వీడియోను సౌత్ ఆస్ట్రేలియన్ జంతు స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోలా జంట ఆస్ట్రేలియాలోని ఓ అడవిలో నివసిస్తోంది. ఈ క్రమంలో అందులో ఆడకోలా అకస్మాత్తుగా మృతి చెందింది. చలనం లేకుండా పడిఉన్న ఆడకోలాను చూస్తూ మగకోలా మేల్కొల్పడానికి ప్రయత్నించింది.

ఆడకోలా శాశ్వతంగా మేల్కోలేదని గుర్తించి.. గుండెలవిసేలా ఏడ్చింది. దాన్ని హత్తుకుని ఏడుస్తుండటం చూపరులను, నెటిజన్లను కంటతడి పెట్టించింది. ప్రేమలు, ఆప్యాయతలు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోలా రెస్క్యూ టీం రెండు జీవులను సంరక్షణలోకి తీసుకున్నాయి. ఆడకోలా కళేబరం మృతికి గల కారణాలు తెలియరాలేదు. అది అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సదరు వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మనుషుల బంధాలు సన్నగిల్లుతున్న సమయంలో కోలాల మధ్య ఆత్మీయత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత కనువిప్పు కలగజేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 07:26 PM