Share News

UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు అలెర్ట్.. ఆ అకౌంట్లు ఇకపై పని చేయవు..

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:16 PM

ప్రస్తుతం దేశంలో చాలా మంది డిజిటల్ విధానంలోనే చెల్లింపులు చేస్తున్నారు. ఫోన్ పే, పేటీఎమ్, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న కిరణా దుకాణం నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్ని చోట్లా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు. దీంతో యూపీఐ పేమెంట్లు భారీగా పెరిగిపోయాయి.

UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు అలెర్ట్.. ఆ అకౌంట్లు ఇకపై పని చేయవు..

ప్రస్తుతం దేశంలో చాలా మంది డిజిటల్ విధానంలోనే చెల్లింపులు (Digital Payments) చేస్తున్నారు. ఫోన్ పే (PhonePe), పేటీఎమ్ (Paytm), గూగుల్ పే వంటి యూపీఐ (UPI) యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న కిరణా దుకాణం నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్ని చోట్లా యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేస్తున్నారు. దీంతో యూపీఐ పేమెంట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ వినియోగదారులకు కీలక సూచన (Important Alert) చేసింది.

ఏడాదికి పైగా నిరుపయోగంగా, ఎవరూ వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలను డీ-యాక్టీవేట్ చేయాలని యూపీఐ యాప్స్‌ను ఆదేశించింది. జనవరి 1వ తేదీ నుంచి ఆ ఐడీల ద్వారా చెల్లింపులు చేయడం కుదరదు. బ్యాంక్‌ అకౌంట్‌లకు లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్‌లను కొందరు మారుస్తుంటారు. ఆ సమయంలో పాత వాటిని డీ-లింక్ చేయడం మానేస్తారు. ఈ నేపథ్యంలో పాత నంబర్‌ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్‌యాక్టివ్‌ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్‌ లక్ష్యమని ఎన్‌పీసీఐ పేర్కొంది.

యూపీఐ వినియోగదారులు తమ ఫోన్‌లో యూపీఐకి సంబందించిన సమాచారం, టాన్సాక్షన్ వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. దీని వల్ల అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు. మనం ఉపయోగించని, లేదా ఆగిపోయిన మొబైల్ నెంబర్‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 90 రోజుల తర్వాత మరొక సబ్‌స్క్రైబర్‌కు కేటాయిస్తుంది. వినియోగదారు వారి బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయకుంటే తప్పుడు బదిలీలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - Jan 01 , 2024 | 01:16 PM