Share News

Home Cleaning Liquid: ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా మెరుస్తూ కనిపించాలా? ఇంట్లోనే ఈ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసేయండి!

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:56 AM

ఇల్లు తుడుచుకోవడానికి ఇప్పట్లో చాలా రకాల లిక్విడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంట్లోనే తయారుచేసుకునే ఈ లిక్విడ్ తో ఇల్లు తళతళా మెరుస్తుంది.

Home Cleaning Liquid:  ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా మెరుస్తూ కనిపించాలా? ఇంట్లోనే ఈ క్లీనింగ్  లిక్విడ్ తయారు చేసేయండి!

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంటే రోగాలు దూరంగా ఉంటాయి. అయితే ఇల్లు తుడుచుకోవడానికి ఇప్పట్లో చాలా రకాల లిక్విడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రసాయనాలు ఎక్కువ, పైపెచ్చు ఖర్చు కూడా ఎక్కువే. అదే ఇంట్లో తయారుచేసిన లిక్విడ్ ను ఉపయోగించి ఇల్లు తుడుచుకుంటే డబ్బు ఆదా.. ఇల్లు కూడా ఊహించని రీతిలో మెరుస్తుంది. ఇంట్లోనే క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడం ఎలా? దాన్ని ఉపయోగించడం ఎలా? తెలుసుకుంటే..

క్లీనింగ్ లిక్విడ్..

ఇంట్లోనే క్లీనింగా్ చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు..

నాప్తలిన్ బాల్స్..

ఉప్పు..

కర్పూరం..

వేప ఆకులు..

ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!


తయారీ విధానం..

ముందుగా నాప్తలిన్ బాల్స్, ఉప్పు, కర్పూరం మూడింటిని కలిపి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.

వేప ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టుకోవాలి. ఈ నీటిలో గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్లీ మరిగించాలి. ఈ నీరు చల్లారిన తరువాత వడగట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ ద్రవాన్ని ఇల్లు తుడుచుకోవడానికి ఉపయోగించవచ్చు.

ఉపయోగించే విధానం..

ఇల్లు తుచుచుకునేటప్పుడు బకెట్ లోని నీటిలో పైన తయారుచేసుకున్న లిక్విడ్ ను రెండు మూతలు జోడించాలి. ఈ నీటితో ఇల్లంతా సాధారణంగానే తుడుచుకోవాలి. ఇందులో ఉపయోగించిన నాప్తలీన్ కీటకాలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. ఇంట్లో ప్రతికూలతను తొలగించడానికి ఉప్పు సహయపడుతుంది. బ్యాక్టీరియా తొలగించడానికి, ఇల్లాంతా మంచి సువాసన వెధజల్లడానికి కర్పూరం సహాయపడుతుంది. ఇక ఇందులో ఉపయోగించిన వేప ద్రావణం గురించి అందరికీ తెలిసిందే.. ఈ లిక్విడ్ ను రెండు మూతలు వాడితే చాలు.. ఇంటి ఫ్లోర్ మెరుపు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 11:56 AM