Share News

Viral Video: ఫ్రెండ్స్ అలా అరవడంతో నవ్విన వరుడు.. వధువు ఎంత సీరియస్‌గా లుక్ ఇచ్చిందంటే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:47 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ``మోయ్-మోయ్`` మీమ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫన్నీ మీమ్ ఉపయోగిస్తూ రూపొందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదైనా నాశనం అయిపోయింది, ఇక పనికి రాదు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ మీమ్‌ను వాడుతున్నారు.

Viral Video: ఫ్రెండ్స్ అలా అరవడంతో నవ్విన వరుడు.. వధువు ఎంత సీరియస్‌గా లుక్ ఇచ్చిందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ``మోయ్-మోయ్`` మీమ్ (Moy-Moy meme) బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫన్నీ మీమ్ ఉపయోగిస్తూ రూపొందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ఏదైనా నాశనం అయిపోయింది, ఇక పనికి రాదు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ మీమ్‌ను వాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Funny Video) చూస్తే నవ్వు రాక మానదు. @DalviNameet అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ పెళ్లి వేడుకలో చిత్రీకరించారు. ఆ వీడియోలో తన ఎదురుగా ఉన్న వధువు (Bride)మెడలో వరుడు (Groom) పూల దండ వేశాడు. వెంటనే అతడి స్నేహితులు ``మోయ్-మోయ్`` అంటూ పాడడం మొదలుపెట్టారు. స్నేహితుల అరుపులు విని వరుడు చిరు నవ్వులు చిందించాడు. వెంటనే వధువు వారి వైపు చాలా సీరియస్‌గా చూసి తల దించుకుంది. ఈ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్.. ``ఆ చూపు చాలా చెబుతోంది. ఇక, ఆ వరుడు తన స్నేహితులను ఎప్పటికీ కలుసుకోలేడు`` అని కామెంట్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3.5 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``పాపం.. ఆ వరుడి పరిస్థితి ఏంటో అర్థమవుతోంది``, ``త్వరలో ఆ వరుడు ఓ భారీ తుఫాను ఎదుర్కోబోతున్నాడు``, ``ఆ వరుడికి అదే చివరి చిరునవ్వు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 03:47 PM