Share News

Viral Video: ఓర్నీ.. మెడలో దండ ఎవరైనా ఇలా వేస్తారా? వధువు మీదకు దూకిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:00 AM

ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఓర్నీ.. మెడలో దండ ఎవరైనా ఇలా వేస్తారా? వధువు మీదకు దూకిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్!
Bride and Groom

ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ మ్యారేజ్ వీడియోలు (Wedding Videos) సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధువు (Bride) మెడలో పూల మాల వేసేందుకు వరుడు (Groom) చేసిన పని చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఈ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది (Viral Videos).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు వివాహ వేదికపై నిల్చుని ఉన్నారు. వరుడి మెడలో వధువు పూలమాల (Vara Mala) వేసింది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో దండ వేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి వధువును పైకి ఎత్తుకున్నారు. దీంతో వరుడు దండ పట్టుకుని కుర్చీ ఎక్కాడు. అయినా వధువు అందలేదు. దీంతో కుర్చీ మీద నుంచి వధువు మీదకు దూకి మాల ఆమె మెడలో వేశాడు. దీంతో వధువు, ఆమెను ఎత్తుకున్న వారు కింద పడ్డారు.


@Sarita_sarawag అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదున్నర లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``చాలా తెలివైన వాడు``, ``వేదిక మీదే వధువును పడేశాడు``, ``ఇలాంటి క్షణాలే భారతీయ వివాహాలను ఆహ్లాదంగా మారుస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Miss Universe: అందాల పోటీల్లో సరికొత్త సంచలనం.. 60 ఏళ్ల మహిళకు అందాల కిరీటం..!


Exam: ఆన్సర్ షీట్‌లో జై శ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. పేపర్ దిద్దిన టీచర్ ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2024 | 11:00 AM