Share News

Viral Video: వామ్మో.. ఇదెక్కడి డ్యాన్స్ అన్నా.. బరాత్‌లో వరుడి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:25 PM

భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహం అనేది ఓ భారీ వేడుక. ఆ వేడుక జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చుబెడతారు. వధూవరులు కూడా ఎంతో సంతోషంగా ఆ వేడుకలో పాల్గొంటారు

Viral Video: వామ్మో.. ఇదెక్కడి డ్యాన్స్ అన్నా.. బరాత్‌లో వరుడి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Groom dance

భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహం (Marriage) అనేది ఓ భారీ వేడుక. ఆ వేడుక జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చుబెడతారు. వధూవరులు కూడా ఎంతో సంతోషంగా ఆ వేడుకలో పాల్గొంటారు. ఇటీవలి కాలంలో సంగీత్, బరాత్ పేర్లతో పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌లు (Dance) కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Groom Dance). ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


manish_ramgarh అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధువు, వరుడు డీజే ఫ్లోర్‌పై ఉన్నారు. బాలీవుడ్‌ రొమాంటిక్ సాంగ్ ``క్యుంకీ తుమ్ హి హో``కు వరుడు ఒంటరిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. వధువు నిల్చుని ఉండగా వరుడు విభిన్న పద్ధతిలో డ్యాన్స్ చేశాడు. విచిత్రమైన స్టెప్స్ వేశాడు. ఆ డ్యాన్స్ చూస్తే వధువు నిల్చుని ఉండిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు వరుడి డ్యాన్స్ చూసి నవ్వుకున్నారు. ఆ డ్యాన్స్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను 7.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వరుడి డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆ వరుడి కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది``, ``పాపం.. ఆ వధువు చాలా కోపంగా ఉన్నట్టుంది` ``నేను బ్రహ్మచారిగా చనిపోతాను కానీ ఇలా మాత్రం డ్యాన్స్ చేయను``, ``డాక్టర్ ఏం చెప్పారు, ఎప్పుడు కోలుకుంటాడు``, ``ఈ వరుడు మాంత్రికుడిలా ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: వీళ్లెవరో అంబానీని మించిపోయారు.. ఏకంగా టాయిలెట్‌లో కూడా ఏసీ పెట్టుకున్నారు.. వీడియో వైరల్!


Opitcal Illusion: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న దొంగను పట్టుకోండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 02 , 2024 | 03:25 PM