Green Banana: ఆకుపచ్చ అరటిపళ్ల గురించి విన్నారుగా? వీటితో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
ABN , Publish Date - Jan 02 , 2024 | 08:57 PM
ఆకుపచ్చ అరటి పళ్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కడుపులోని హితకర బాక్టీరియాకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని,
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ అరటి పళ్లు (Yellow Bananas) తినాలా లేక ఆకుపచ్చ అరటి (Green Bananas) పళ్లు తినాలా?.. నెట్టింట తరచూ జరిగే చర్చ ఇది. అయితే, న్యూట్రిషనిస్టులు మాత్రం తమ అభిప్రాయాలను ఎప్పుడో స్పష్టంగా చెప్పేశారు.
ఆకుపచ్చ అరటిపళ్లతో ఎనలేని లాభాలు..
పూర్తిగా పండేలోపలే ఆకుపచ్చ అరటిపళ్లను తీసేస్తారు. ఇలాంటి పళ్లను ఇంగ్లిష్‌లో ప్లాంటెయిన్స్ అంటారు. ఇందులో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో మేలు చేసే బ్యాక్టీరియాకు ఎంతో ఉపయోగకరం. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ కారణంగా జీర్ణవ్యవస్థ మరింత శక్తిమంతమవుతుంది. షుగర్ లెవెన్స్ నిలకడగా ఉంటాయి. ఒకసారి ఇవి తిన్నాక చాలా సేపటి వరకూ కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించడంతో ఆకలి మీద నియంత్రణ వస్తుంది. ఇందులో చెక్కర స్థాయిలు కూడా తక్కువగానే ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ అరటి ఎంతో ఉపయుక్తం.
Hangover Recovery Tips: హ్యాంగోవరా? నిన్న రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా? వెంటనే ఇలా చేయండి!
ఇక సాధారణ అరటిపళ్ల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇవి బాగా పండటంతో చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉండి తియ్యగా మారతాయి. బాగా పండటం వల్ల అరటిలో యాంటీఆక్సిడెంట్లు, డోపమైన్, కాటెచిన్స్ వంటి హితకర రసాయనాలు పెరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండెకు మేలు కలుగుతుంది.
కాబట్టి, ఏ అరటి బెటర్ అనే అంశం ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉండి. రెండు రకాల పళ్లకు ప్రత్యేక గుణాలు ఉన్నాయి కాబట్టి అవసరానికి తగిన పండును ఎంచుకోవాలి.
Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూస్తే..
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?