Share News

Hangover Recovery Tips: హ్యాంగోవరా? నిన్న రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా? వెంటనే ఇలా చేయండి!

ABN , Publish Date - Jan 01 , 2024 | 03:00 PM

హ్యాంగోవర్ నుంచి త్వరగా కోలుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వీలైనంతగా నీరు తాగడం, ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయాలు తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయడం వంటివి చేస్తే హ్యాంగోవర్ ఎఫెక్ట్ తగ్గుతుంది. చన్నిటీ స్నానం కూడా ఇందుకు ఉపకరిస్తుంది.

Hangover Recovery Tips: హ్యాంగోవరా? నిన్న రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా? వెంటనే ఇలా చేయండి!

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నిన్న రాత్రి జనాలు ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే, వెలుగునీడల్లాగా ఎంజాయ్‌మెంట్ వెనక వేదన కూడా ఫాలో అవుతుంది. హ్యాంగోవర్‌ (Hangover) దెబ్బకు ఇప్పటికీ కోలుకోని వారు కోకొల్లలు! అల్కహాల్ ప్రభావం అలాంటిది మరి!

ఆల్కహాల్‌ ఎఫెక్ట్ ఇదీ..

వైద్య శాస్త్రం ప్రకారం, ఆల్కహాల్ ఓ డైయూరెటిక్. అంటే, కిడ్నీలు మూత్రం ఎక్కువ ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఫలితంగా, శరీరంలో నీరు అధికంగా బయటకు పోయి డీహైడ్రేషన్ బారిన పడతారు. తలనొప్పి, అలసట, తలతిరగటం, కడుపులో తిప్పుతున్నట్టు ఉండటం వంటి హ్యాంగోవర్ లక్షణాలన్నీ డీహైడ్రేషన్ వల్లే!


రికవరీ ఇలా..

హ్యాంగోవర్ నుంచి వేగంగా బయటపడేందుకు (Hangover Recovery tips) కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే వేగంగా రిలీఫ్ దొరుకుతుంది. అవేంటంటే..

  • హ్యాంగోవర్ బాధితులు ముందుగా తగినంత నీరు తాగాలి. వీలైనన్ని సార్లు నీరు తాగుతూ ఉంటే త్వరగా హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చు

  • పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వీటితో రక్తంలో చెక్కర స్థాయిలు స్టేబుల్ అవుతాయి. శరీరం కోలుకునేందుకు ఇది చాలా కీలకం.

  • లవణాలు అధికంగా ఉండే స్పోర్ట్స్ డ్రింక్స్, ఇతర పానీయాలు ఎంత తాగితే అంత మంచిది.

Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూస్తే..

  • హ్యాంగోవర్ నుంచి త్వరగా కోలుకునేందుకు వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోండి. దీని వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుంది. కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది.

  • హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్న వారు చన్నీటిస్నానం చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. చన్నీటి వల్ల రక్తప్రసరణ వెంటనే పెరిగి తలనొప్పి వంటి వాటి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

  • మత్తుగా ఉన్నట్టుంది కదా అని అనుకుని కాఫీ తాగకండి. ఇది తప్పు. కాఫీ లేదా కెఫీన్ రసాయనం అధికంగా ఉన్న పానీయాలతో యాంక్జైటీ, అలసట వంటివి మరింత పెరుగుతాయి. కాఫీ కంటే హెర్బల్ టీ తాగడం మంచిది.

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!

  • కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటే కాస్తంత అల్లం తినండి. వెంటనే అంతా సద్దుకుంటుంది. అల్లం నమిలినా, లేదా రసం లాగా తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

  • మనసు కుదుట పడేందుకు అలా కాసేపు బయటకు వెళ్లిరండి. ఇది కూడా హ్యాంగోవర్ సమస్యను కొంత వరకూ తగ్గిస్తుంది.

  • చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తూ ఒళ్లు కాస్తంత కదిపితే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. దీంతో, హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడొచ్చు.

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?

  • తేనె, కొబ్బరి నీళ్లు, వంటి సహజసిద్ధ ఆహారాలు కూడా హ్యాంగోవర్ తొలగిపోయేందుకు హెల్ప్ చేస్తాయి.

  • పూర్తిగా కోలుకునే వరకూ మళ్లీ మద్యం జోలికెళ్లకండి. అప్పుడే హ్యాంగోవర్ నుంచి పూర్తిగా బయటపడతారు. హ్యాంగోవర్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించండి.

Disclaimer: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం అస్సలు కాదు.

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Updated Date - Jan 01 , 2024 | 04:51 PM