Share News

Viral Video: హోలీ పేరుతో వికృత చేష్టలు.. స్కూటీ మీద అమ్మాయిల ఘాటు రొమాన్స్.. పోలీసులు ఏం చేశారంటే!

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:38 PM

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు హోలీ పండుగను అత్యంత సంతోషంగా జరుపుకుంటున్నారు. రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు.

Viral Video: హోలీ పేరుతో వికృత చేష్టలు.. స్కూటీ మీద అమ్మాయిల ఘాటు రొమాన్స్.. పోలీసులు ఏం చేశారంటే!

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు హోలీ (Holi) పండుగను అత్యంత సంతోషంగా జరుపుకుంటున్నారు. రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు (Holi Celebrations). అయితే కొన్ని చోట్ల యువకులు హద్దులు మీరి ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. పోలీసులు (Noida Police) వెంటనే స్పందించి వారికి భారీ జరిమానా (Fine) విధించారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి స్కూటీ మీద వెళుతున్నారు. అబ్బాయి స్కూటర్ నడుపుతుండగా.. వెనకాల ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చున్నారు. బ్యాగ్రౌండ్‌లో ``మోహే రంగ్ లగా దే`` పాట ప్లే అవుతుండగా స్కూటీ మీద ఇద్దరమ్మాయిలు రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి రొమాన్స్‌ను వేరే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో గ్రేటర్ నోయిడాకు చెందినదని తెలుస్తోంది.

Viral Video: ఆహా.. తెలివి అంటే ఇదే మరి.. ఇస్త్రీ పెట్టెతో జుట్టు స్ట్రయిటనింగ్.. వీడియో వైరల్!

ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. వారిని గుర్తించి జరిమానా విధించారు. నోయిడా పోలీసులు వారికి రూ. 33 వేల చలాన్ విధించినట్టు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు 23 వేలకు పైగా వ్యూస్ లభించాయి.

Updated Date - Mar 25 , 2024 | 03:38 PM